మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఒక వైపు రచ్చ రచ్చ చేస్తూనే మరో వైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గురించి స్పందించాడు. ఈ ఎన్నికల్లో నాకు నాగబాబు గారి మద్దతు ఉంటుందని ఆశించాను. కాని ఆయన నాకు మద్దతు ఇవ్వలేదు. ఆయన మద్దతు ప్రకాష్ రాజ్ గారికి ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన క్రమశిక్షణ గురించి మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ లో క్రమ శిక్షణ ఉంటే రెండు సార్లు మా నుండి బహిష్కరణకు గురి అయ్యేవాడా అంటూ ప్రశ్నించాడు.
ఈ ఎన్నికల్లో నా గురించి మాట్లాడాలి.. నా పై విమర్శలు చేయాలి పర్వాలేదు కాని నా తమ్ముడు మరియు అక్క గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఎన్నికల్లో రామ్ చరణ్.. ప్రభాస్.. అల్లు అర్జున్ ల్లో ఎవరైనా నిల్చుని ఉంటే ఖచ్చితంగా నేను తప్పుకుని వారిని గెలిపించే వాడిని. ఎందుకంటే వారికి ఎలాంటి రాజకీయ అజెండా ఉండదు. కనుక వారు ఖచ్చితంగా మా ఎన్నికల్లో ఉండాల్సిన వారు. కాని కొందరు రాజకీయ అజెండా పెట్టుకుని పోటీ చేస్తున్నారు అంటూ విష్ణు పేర్కొన్నాడు.