మా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన మంచు విష్ణు ఆ తర్వాత మెగా కాంపౌండ్ గురించి కాస్త సీరియస్ గా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పేరు తీయకుండా విమర్శలు గుప్పించాడు. దాంతో మెగా కాంపౌండ్ ఇప్పటికే మంచు వారిపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ లో జరిగిన దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మరియు మంచు విష్ణు లు తారస పడ్డారు. ఇద్దరు కూడా సహజంగా అయితే కనీసం కంటి చూపుతో అయినా మాట్లాడుకోవాలి. కాని పవన్ పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ పక్కన వచ్చి మంచు విష్ణు కూర్చున్నాడు. పలకరింపుగా నవ్వాడు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం పట్టించుకోలేదు. మంచు విష్ణు విషయంలో మెగా కాంపౌండ్ ఎంత కోపంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మంచు విష్ణు పలకరించినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించకుండా మంచి పని చేశాడని.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పంథాను ముందు ముందు కూడా అనుసరించాలంటూ అభిమానులు కోరుతున్నారు. మంచు విష్ణు విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.