‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైలాగ్ రివీల్‌ చేసిన జక్కన్న

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 7వ తారీకున విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. సినిమా విడుదలకు ఇంకా 60 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా స్థాయిని పెంచేందుకు గాను ప్రయత్నాలు మొదలు అయ్యాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన ఒక డైలాగ్ ను జక్కన్న స్వయంగా రివీల్‌ చేశాడు.

యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.. ఒక వేళ అది ధర్మయుద్దం అయితే విజయం తథ్యం అంటూ ఆర్ ఆర్ ఆర్‌ లోని డైలాగ్‌ ను రాజమౌళి చెప్పారు. సినిమాలో ఈ డైలాగ్‌ ఎంతటి ఎమోషనల్ గా ఆయన చూపించారో చూడాలి. చాలా పవర్ ఫుల్‌ గా ఉన్న ఈ డైలాగ్ ను అజయ్ దేవగన్ చెప్పి ఉంటాడు అనేది టాక్. యుద్ద సన్నివేశాలు భారీగా ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లను జక్కన్న చూపించిన విధానం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.