హాలిడేకు మాల్దీవ్స్ చెక్కేసిన పూజ హెగ్డే

ఇండియన్ సినిమాలో బిజియస్ట్ హీరోయిన్స్ లో ఒకరైన పూజ హెగ్డే హాలిడేకు మాల్దీవ్స్ చెక్కేసింది. కోవిడ్ తర్వాత నుండి ఇండియన్ సెలబ్రిటీలకు మాల్దీవ్స్ అనేది ఫెవరెట్ హాలిడే డెస్టినేషన్ అయిపోయింది. శనివారం నాడు మాల్దీవ్స్ లో దిగిన పూజ హెగ్డే పలు ఫోటోలను షేర్ చేసింది. నటిగా ఫుల్ బిజీగా ఉన్న పూజ హెగ్డే హాలిడే ద్వారా ఉపశమనం పొందాలనుకుంది.

తెలుగులో అయితే పూజ హెగ్డే ఫామ్ మాములుగా లేదు. వరసగా సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతోంది. తమిళ్ లో కూడా సినిమా చేస్తోంది ఈ భామ. విజయ్ సరసన బీస్ట్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది.

రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టిన ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలను ప్రమోట్ చేయాల్సి ఉంది.