బిగ్ బాస్ 5: నాగార్జున కూడా సన్నీను టార్గెట్ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం కూడా పూర్తి కావొస్తోంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో ఎంత రచ్చ జరిగిందో మనందరం చూసాం. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సన్నీకి సిరి, షణ్ముఖ్ మధ్య గొడవ పెద్దగానే జరిగింది. ఇక ఎన్నీ మాస్టర్, కాజల్ ల మధ్య గొడవ కూడా తారాస్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ ఈరోజు నాగార్జున క్లారిటీ ఇస్తారని కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూసారు.

ముఖ్యంగా సన్నీ వాడిన అప్పడం అనే పదం గురించే పెద్ద చర్చ నడిచింది. సిరిను ఉద్దేశించి అప్పడం అవుతావు అనే మాటకు సరైన అర్ధం ఏమై ఉంటుందా అని ఈరోజు ఎపిసోడ్ లో డిస్కషన్ నడిచింది. దీనికంటే ముందు శుక్రవారం ఎపిసోడ్ ను చూపించారు. అందులో ప్రియాంక, సన్నీ పార్టిసిపేట్ చేయగా ప్రియాంక గెలిచింది. రామ్ చరణ్ ఆటోగ్రాఫ్ చేసిన ఫొటోగ్రాఫ్ ను గెలుచుకుంది.

కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన ఫైర్ శుక్రవారం ఎపిసోడ్ లో కంటిన్యూ అయింది. మానస్, ప్రియాంక మీద సీరియస్ అయ్యాడు. తన మీద అరవడంతో ప్రియాంక అప్సెట్ అయింది. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎఫ్ఐఆర్ టాస్క్ ను ప్రవేశపెట్టాడు. అంటే ఒక కంటెస్టెంట్ వేరే కంటెస్టెంట్ తప్పు చేసాడు అనిపిస్తే వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జైలుకి వెళ్లిన కంటెస్టెంట్ తరుపున ఎవరైనా వాదించాల్సి ఉంటుంది. ఆ వాదనలు విన్న తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఓట్ల ద్వారా నిందితుడు తప్పు చేశాడా లేదా అన్నది తెలపాల్సి ఉంటుంది.

ఈ ఎఫ్ఐఆర్ టాస్క్ లో ఎక్కువగా సన్నీ నిందితుడిగా నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ లో తన కూల్ ను కోల్పోయి కొన్ని మాటలు జారడం అనేది తప్పుగా తేల్చేసారు అందరూ. నాగార్జున కూడా సన్నీ మాట్లాడింది తప్పు అన్నట్లుగానే మాట్లాడాడు. సన్నీ అప్పడం అని సిరిని అన్నాడు కరెక్టే కానీ అది ఏ సెన్స్ లో అన్నాడు అన్నది కనీసం కన్సిడర్ చేయలేదు. మానస్, సన్నీ, కాజల్ తప్ప మిగతా అందరూ కూడా ఆ గ్రూప్ కు వ్యతిరేకంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. సో ఇక కేసు వాదనతో సంబంధం లేకుండా సన్నీ ఎక్కువసార్లు గిల్టీ అని తేలాడు.

ఇక జెస్సీతో నాగార్జున మాట్లాడాడు. ఇంకా వెర్టిగో ప్రాబ్లెమ్ పూర్తిగా తగ్గలేదు. సో, తను ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.