అర్జున ఫల్గుణకు కొమ్ము కాస్తోన్న ఎన్టీఆర్ అభిమానులు

హీరోగా శ్రీ విష్ణు తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నాడు. శ్రీ విష్ణు అంటే ఒక ఇమేజ్ ఉంది. ఏ సినిమా పడితే అది చేయడం తనకు ఇష్టముండదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలనే చేయడానికి ఇష్టపడతాడు. రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు నుండి వస్తోన్న నెక్స్ట్ మూవీ అర్జున ఫల్గుణ.

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. మాములుగా శ్రీ విష్ణు సినిమాలకు వచ్చే రెస్పాన్స్ కంటే ఈ సినిమాకు రెస్పాన్స్ ఇంకా బాగుంది.

విషయమేంటా అని చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు కనిపిస్తాడట. ఎన్టీఆర్ కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం వంటివి కూడా ఉంటాయట. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం పట్ల ఎగ్జైట్ అవుతున్నారు.