సామ్ ఛీర్ ఫుల్ గా జాయ్ ఫుల్ గా!

స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న అనంతరం కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ ల పరంగా కమింట్ మెంట్ తో ఫుల్ జోష్ లో ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించి కెరీర్ ని మరింత బిల్డ్ చేసుకుంటోంది. ఇటీవలే `పుష్ప` సినిమాలో ఐటం పాటలో నర్తించేందుకు సై అనేసింది.

ఈ పాటతో సమంతలో కొత్త కోణం ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. అటు బాలీవుడ్ లో తాప్సీ ప్రోడక్షన్ హౌస్ లో సామ్ ఓ సినిమాలో నటిస్తోంది. ఉత్తరాది బిగ్ స్టార్స్ సరసన అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్ ప్లానింగ్స్ అన్ని బాలీవుడ్ లోనే స్థిరపడేలా పక్కాగా ప్లాన్ చేస్తూనే టాలీవుడ్ లోనూ నటిస్తూ ముందుకు వెళుతోంది.

ఇటు సోషల్ మీడియాలోనూ సామ్ అంతే ఉత్సాహంతో అభిమానులకు టచ్ లో ఉన్నారు. అన్ని చేదు అనుభవాల్ని మర్చిపోయి.. కెరీర్ పరంగా ఎలా ఎదిగాలి? అన్న దానిపై సామ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత కొత్త ఫోటో షూట్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఇందులో సమంత డిజైనర్ ఫ్లోరిష్ గౌనులో ఎంతో అందంగా ఒదిగిపోయి కనిపించింది. అలా ప్లెజెంట్ గా నవ్వుల వర్షం కురిపిస్తోంది. డార్క్ ఆరేంజ్ ఫ్లోరల్ గౌనుపై పింక్ కలర్ ఫ్లవర్స్ ఆకట్టుకోగా.. ఆ ముఖంలో అందమైన నవ్వు సామ్ ని మరింత బ్యూటీఫుల్ గా ఎలివేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది.

సామ్ అభిమానులంతా ఆ నవ్వును చూసి ఫిదా అయిపోతున్నారు. విడాకుల తర్వాత కొంత డిప్రెషన్ లోకి వెళ్లిన సామ్ చాలా గ్యాప్ తర్వాత ఇలా సంపూర్ణ సంతోషంగా కనిపించడం ఇదే తొలిసారి. ఇక సమంత సినిమాల లైనప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం `శాకుంతలం`లో నటిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. చిత్రీకరణ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.