ఆహా.. బాలయ్యతో బ్రహ్మానందమే

నందమూరి బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీ అన్ స్టాపబుల్ కు చిన్న బ్రేక్ పడింది. వరుసగా రెండు వారాలు మోహన్ బాబు మరియు నానిల ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అయ్యాయి. మూడవ వారం ఎపిసోడ్ షూటింగ్ చేయకుండానే బాలయ్య బాబు చేతికి సంబంధించిన ఆపరేషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత కనీసం రెండు మూడు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో తప్పక అన్ స్టాపబుల్ కు చిన్న బ్రేక్ వేశారు. రెండు ఎపిసోడ్ ల తర్వాత బాలకృష్ణ బ్రేక్ ఇవ్వడంతో అభిమానులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో ఆహా టీమ్ నుండి ఆసక్తికర అప్డేట్ ఒకటి అందుతోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ మూడవ ఎపిసోడ్ కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంతో ఉండబోతుందట. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీరిద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అనేది అందరికి తెల్సిందే. ఇటీవలే అలీతో సరదాగా షో లో బ్రహ్మానందం వచ్చాడు. ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ లో కూడా బ్రహ్మానందంను తీసుకు వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య అన్ స్టాపబుల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నట్లుగా అధికారిక ప్రకటన తరువాయి. గత కొంత కాలంగా బ్రహ్మానందం కామెడీని జనాలు మిస్ అవుతున్నాయి.

బ్రహ్మానందం మళ్లీ సినిమాలు చేయాలని.. ఆయన కామెడీతో టాలీవుడ్ ను ఏలేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మళ్లీ బ్రహ్మానందం బిజీ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే సమాచారం అందుతోంది. వచ్చిన ఆఫర్లను చేస్తూ చిన్నా చితకా సినిమాలు అని చూడకుండా మంచి కామెడీని అందించేందుకు బ్రహ్మానందం నటిస్తున్నాడు. జాతిరత్నాలు సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా నటించి ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అలాంటి బ్రహ్మానందం అన్ స్టాపబుల్ లో కనిపించబోతున్న నేపథ్యంలో అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో ముందు ముందు మరెంత మంది స్టార్స్ వస్తారో చూడాలి.