పవన్.. సూరి సినిమా చేతులు మారిందా?

పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా పూర్తి కావచ్చింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ కూడా పునః ప్రారంభం కాబోతుంది.

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి అయ్యిందని తెలుస్తోంది. జనవరి లో హరి హర వీరమల్లు ప్రారంభించి సమ్మర్ వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.

ఆ మూడు సినిమాలు కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేయబోతున్న నేపథ్యంలో కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా ఆ తర్వాత మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ కు ఆప్తుడిగా పేరున్న రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా చేతులు మారింది అంటూ మీడియా వర్గాల్లో పుకార్లు గుప్పుమంటున్నాయి.

సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగంను జీ స్టూడియో వారు దక్కించుకున్నారని.. వారికే మెజార్టీ భాగస్వామ్యంను ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలేం జరుగుతుంది అంటూ అభిమానులు గందరగోళంలో ఉన్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియో భాగస్వామ్యం పూర్తి స్థాయిలో కాలేదు.. కాని శాటిలైట్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ను పూర్తిగా కొనుగోలు చేయడం జరిగిందట. అంతే కాకుండా పలు ఏరియాలో థియేట్రికల్ రైట్స్ ను కూడా జీ స్టూడియోస్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట. దాంతో సినిమా కు జీ స్టూడియో వారు కూడా నిర్మాత అయ్యి ఉంటారు అనే భావన కొందరిలో కలుగుతుంది.

కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి కాని మెయిన్ గా జీ స్టూడియో వారు కూడా ఈ సినిమా కు భాగస్వామిగా ఉన్నారు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కనీసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందో లేదో తెలియదు కాని అప్పుడే పదుల కోట్ల బిజినెస్ జరగడం పవన్ క్రేజ్ కు నిదర్శణం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.