అరుదైన మైలు రాయి చేరిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇంతకు ముందు మహేష్ బాబు ట్విట్టర్ లో ట్వీల్స్ చాలా చాలా అరుదుగా పడేవి. మహేష్ బాబు 2010 సంవత్సరంలో ట్విట్టర్ లో జాయిన్ అయ్యాడు. మొదటి నాలుగు అయిదు సంవత్సరాలు ఆయన ట్వీట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసే మాదిరిగా ఎదురు చూసేవారు. ఆ తర్వాత తర్వాత అతడు స్పీడ్ పెంచాడు. ఈమద్య కాలంలో ప్రముఖులు.. తనకు సన్నిహితులు అయిన ఇండస్ట్రీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులకు పుట్టిన రోజు శుభాకాక్షలు చెప్పడంతో పాటు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఉండటం చేస్తున్నాడు. తన సినిమాల ట్వీట్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలు చూసి తన రివ్యూ లు చెప్పడం చేస్తున్నాడు.

తాజాగా బాలకృష్ణ సినిమా అఖండకు వస్తున్న రెస్పాన్స్ పై స్పందించాడు. సినిమా ఇండస్ట్రీ కి మళ్లీ మంచి రోజులు వచ్చాయి అన్నట్లుగా స్పందించాడు. రెగ్యులర్ గా ఏదో ఒక విషయం పై మహేష్ బాబు స్పందిస్తూనే ఉన్నాడు. మహేష్ బాబు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్న కారణంగా ఆయన ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. సౌత్ లో ఏ హీరోకు కూడా లేనంత మంది ఫాలోవర్స్ ను ట్విట్టర్ లో మహేష్ బాబు దక్కించుకున్నాడు. తాజాగా మరో మైలు రాయిని మహేష్ బాబు దక్కించుకున్నాడు. మహేష్ బాబు ట్విట్టర్ లో 12 మిలియన్ ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నాడు. ఏ సౌత్ హీరో కూడా ఈ రేంజ్ ఫాలోవర్స్ ను కలిగి లేరు. ఏ సౌత్ హీరో కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి లేరు. అలాంటిది మహేష్ బాబు ఏకంగా 12 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు.

మహేష్ బాబు ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ను దక్కించుకోవడం చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ స్టార్స్ ను కూడా క్రాస్ చేసేలా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాను చేయలేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా పడితే మహేష్ బాబు రేంజ్ అమాంతం పెరిగి పోతుంది అనడంలో సందేహం లేదు. ఆ సమయంలో ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య మరింతగా పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల ఆవరు అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు ట్విట్టర్ లో దూకుడు తో సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇక ఈయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య విషయానికి వస్తే 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ కూడా చాలా స్పీడ్ గా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. త్వరలోనే కోటి మందిని రీచ్ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.