ఎన్టీఆర్ ను బెస్ట్ హోస్ట్ అంటూ ప్రశంసించిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షో కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెల్సిందే. నిన్న ఆదివారం ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ మధ్య ఉన్న అనుబంధం ఎపిసోడ్ కు స్పెషల్ హైలైట్ గా నిలిచింది. ఎన్టీఆర్, మహేష్ ను అన్న అనడం ఇరు వర్గాల ఫ్యాన్స్ ను సంతోషపెట్టింది.

ఇక మహేష్, ఎన్టీఆర్ హోస్టింగ్ ను మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్, మహేష్ ను హోస్టింగ్ చేయొచ్చుగా అని అడిగినప్పుడు, “హోస్టింగ్ అనేది నాకు సరిపడదు. అది నా వల్ల కాదు, నువ్వు చేస్తున్నందుకు హ్యాట్సాఫ్” అని మహేష్ రిప్లై ఇచ్చాడు. అలాగే నువ్వు బెస్ట్ హోస్ట్ అని కూడా అన్నాడు.

మొత్తంగా ఈ ఎపిసోడ్ కూడా చాలా సరదాగా సాగింది. ఈ ఎపిసోడ్ తో ఎవరు మీలో కోటీశ్వరులు ఈ సీజన్ పూర్తయింది.