విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇక ముంబైలో భారీ ఎత్తున రిసెప్షన్ కు ఏర్పాట్లు చేయనున్నారు. 9డిసెంబర్ రాజస్థాన్ లోని వివాహ వేడుకకు అతికొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బంధువులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలందరికి భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటుపై హానీమూన్ ప్లాన్ చేసుకోనున్నారు. కాగా నేడు ఈ జంట వివాహ అనంతరం హల్దీ వేడుకల్లో సందడి చేశారు.
దానికి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఉత్సవాల కోసం కత్రినా అందమైన లేత గులాబీ రంగు లెహంగాను ధరించింది. విక్కీ కౌశల్ ధోతీ..దుపట్టా ధరించాడు. అలాగే కళ్లకు గ్లాసెస్ ధరించాడు. ఈ ఫోటోల్ని ఉద్దేశిస్తూ.. `శుక్ర్..సబ్ర్.. ఖుషీ` అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలలో విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కౌశల్.. కౌశల్ తల్లి..సోదరీమణులు కూడా ఉన్నారు. ఓ పిక్ లో కత్రినా భర్తని ఎంతో ప్రేమగా తన్మయంతో చూస్తోంది. ముఖానికి పసుపు రాస్తూ నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టా లో వైరల్ గా మారాయి. నెటిజనులు కొత్త జంటను చూసి ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
విక్కీ-క్యాట్ జంట ఈ కార్యక్రమాల్ని అన్నింటిని ముగించుకుని యూరప్ హనీమూన్ కి వెళ్లనుంది. రెండు నెలలు పాటు ఎలాంటి షూటింగ్ లు పెట్టుకోకుండా హనీమూన్ కే సమయాన్ని కేటాయించారు. యూరప్ లో ఏ హోటల్ లో దిగాలి? ఎక్కడెక్కడ తిరగాలి..నైట్ పార్టీలు ఇలా పక్కా ప్లానింగ్ తో ఈ జంట ప్లైట్ ఎక్కనుంది. వెకేషన్ అనంతరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజుల ఇంటి వద్దనే విరామం తీసుకుని షూటింగ్ ల్లో బిజీ కానున్నారు.