ఇటీవలే వకీల్ సాబ్ గా అభిమానుల ముందుకొచ్చాడు పవన్ కల్యాణ్. చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించినా పవన్ లో గ్రేస్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. పవన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు జనసేన కార్యకలాపాలతోనూ క్షణం తీరిక లేదు.
కానీ డిసెంబర్ నెలలో పవన్ కి ఒక ఇంపార్టెంట్ ప్రయాణం మిగిలి ఉంది. ఈ నెలలో ఒక డేట్ తన లైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూళ్ల నుండి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సందర్భంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. భార్య అన్నా లెజ్నెవా.. పిల్లలు పోలెనా పవనోవా.. మార్క్ శంకర్ పవనోవిచ్ లతో కలిసి పవన్ రష్యాకు వెళ్లనున్నారు. రెండేళ్లుగా కరోనా వల్ల రష్యా వెళ్లలేకపోయిన పవన్ ఈసారి తప్పనిసరిగా తన భార్యను తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఈ ప్రయాణానికి కారణమని తెలిసింది. వారం పదిహేను రోజుల విరామాన్ని ఆయన తన కుటుంబం కోసం కోరుకుంటున్నారు.
అన్నా ఒక రష్యన్ మోడల్ కం నటి. 2011 లో పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో నటించింది. ఆ సమయంలో ఆ జంట నడుమ ప్రేమ చిగురించింది. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ వేడుకల్లో అన్నా లెజినోవా తన పిల్లలతో పాల్గొన్న ఫోటోలు ఇంతకుముందు విడుదలయ్యాయి. ఇక పవన్ కూడా రష్యాలో అత్తారింటికి వెళుతూ ఉండే ఫోటోగ్రాఫ్ లు వైరల్ అయ్యాయి. జనవరి 14న విడుదల కానున్న `భీమ్లా నాయక్` ప్రమోషన్ కోసం పవన్ తిరిగి హైదరాబాద్ కు వస్తారని తెలిసింది.