జక్కన్నతో బాలయ్య నెక్ట్స్ అన్ స్టాపబుల్

నందమూరి హీరో బాలయ్య మొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అద్బుతంగా సాగుతోంది. ఆయన హోస్ట్ గా అదరగొడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ అన్నట్లుగా దూసుకు పోతున్నాడు. మొదటి ఎపిసోడ్ ను మోహన్ బాబు గెస్ట్ గా మొదలు పెట్టి రెండవ ఎపిసోడ్ ను నానితో చేశాడు. మూడవ ఎపిసోడ్ కు ఆయన చేతికి జరిగిన ఆపరేషన్ కారణంగా చిన్న బ్రేక్ వచ్చింది.

వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ ను కాదు సెలబ్రేషన్ అంటూ మూడు వారాల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం మరియు అనీల్ రావిపూడితో కలిసి అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య వచ్చేశాడు. ఆ వెంటనే అఖండ యూనిట్ సభ్యులతో తన సినిమా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేశాడు. ఆ స్పెషల్ ఎపిసోడ్ తర్వాత బాలయ్య అన్ స్టాపబుల్ కు వచ్చేది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబుతో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ జరిగింది. కాని ముందే ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయకుండా మంచి సమయం కోసం వెయిట్ చేయాలని భావించారు. కనుక ఆ ఎపిసోడ్ ను ఈ వారం స్ట్రీమింగ్ చేయడం లేదు. ఈ శుక్రవారం బాలయ్య అన్ స్టాపబుల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

నెక్ట్స్ గెస్ట్ ఎవరు అని ఎదురు చూస్తున్న సమయంలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరియు పెదన్న కీరవాణి అన్ స్టాపబుల్ స్టేజ్ పై కనిపించారు. ఇద్దరిని బాలయ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించిన పలు విషయాలు అడుగబోతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను సాధ్యం అయినంత మందికి చేరువ చేసేందుకు అన్ని ప్లాట్ ఫామ్స్ ద్వారా జక్కన్న ప్రమోట్ చేస్తున్నాడు.

అన్ స్టాపబుల్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది కనుక ఆర్ ఆర్ ఆర్ ను ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ఆహా లో సందడి చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షో లో జక్కన్న మరియు కీరవాణి చేయబోతున్న సందడికి సంబంధించిన ప్రోమోను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

సాదారణంగా అయితే ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాని ఎపిసోడ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చు. పైగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉండటం వల్ల వచ్చే వారం స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు.

పైగా వారం వారం వచ్చేందుకు బాలయ్య చేస్తున్నది ఏం సీరియల్ కాదు.. ఆయన చేస్తున్నది ఒక సెలబ్రేషన్ కనుక ఈ వారం గ్యాప్ ఇస్తే అంచనాలు ఆసక్తి మరింతగా పెరుగుతుందనే కామెంట్స్ ను అభిమానులు చేస్తున్నారు. మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.