ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగులో ఎబోవ్ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్ర థియేట్రికల్ రన్ పూర్తయింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పుష్ప అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది.
అయితే హిందీ వెర్షన్ విషయానికొస్తే పుష్ప అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఈ చిత్ర పబ్లిసిటీ కూడా నార్త్ లో పెద్దగా చేయలేదు. అసలు హిందీ వెర్షన్ పై అంచనాలు లేవు. కానీ అందరి ఆలోచనలను పటాపంచలు చేస్తూ రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతూ నార్త్ రూరల్ ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్స్ కొనసాగాయి.
ప్రస్తుతం చాలా చోట్ల థర్డ్ వేవ్ భయాలు, థియేటర్లలో 50 శాతం అనుమతులు వంటి నిబంధనలు ఉన్నా కానీ వాటిని దాటుకుని చిత్రం 80 కోట్ల మార్క్ ను చేరుకుంది.