సంక్రాంతికి విడుదలైన బంగార్రాజుకు ఎదురే లేకుండా పోయింది. పోటీగా పేరున్న చిత్రాలు ఏవీ లేవు. మూడు చిన్న చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి కానీ అవి బంగార్రాజుకు పోటీ కాలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చాయి.
ఇక మరో వారం కూడా బంగార్రాజుకు ఎదురే ఉండబోదు. ఎందుకంటే ఈ వారాంతం నాలుగు చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. ఉనికి, వర్మ, పద్మ శ్రీ, వధుకట్నం చిత్రాలు ఈ వారాంతం విడుదలవుతున్నాయి. కనీసం ఈ సినిమా పేర్లు కూడా ఎవరికీ తెలీవు కాబట్టి బంగార్రాజుకు మరో వారం పాటు కలెక్షన్స్ కు అడ్డంకి లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో మెప్పించిన బంగార్రాజు.. తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ లో అదే మ్యాజిక్ ను క్రియేట్ చేయలేకపోయింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజును కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసాడు.