తమిళ్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించనున్న అఖండ

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అఖండ చాలా ప్రత్యేకమైన చిత్రం. వరస ప్లాపులు తర్వాత బాలయ్య నుండి వచ్చిన అఖండ తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అటు బోయపాటి శ్రీను కెరీర్ కు కూడా అఖండ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ అంతకంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఓటిటిలో విడుదలైన అఖండ అక్కడ కూడా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన పర్యావరణ ప్రాముఖ్యత, హిందుత్వ గొప్పతనం, ఇతర భాషల వారిని ఆకర్షిస్తోంది.

ఇదిలా ఉంటే సైలెంట్ గా అఖండ తమిళ డబ్బింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జనవరి 28న ఈ చిత్రం తమిళనాడులో విడుదల కానుంది. ప్రస్తుతం తమిళ్ లో సినిమాలేవీ విడుదలకు లేకపోవడంతో అఖండకు పెద్ద పోటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి.