ఎన్టీఆర్ సరసన చేస్తున్నట్లు అంగీకరించిన అలియా భట్

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం రూపొందనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం గురించి ఇంకా లాంచ్ కాకముందే హడావిడి మొదలైంది. ఇక ఈ చిత్రం గురించి ఎప్పటినుండో వినిపిస్తున్న వార్త, ఇందులో అలియా భట్ హీరోయిన్ గా చేస్తోందని. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే అలియా భట్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తను ధృవీకరించింది.

“అవును నేను ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాను. కొరటాల శివ వచ్చి కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పాను. అంతబాగుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది అలియా.

ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ సరసన నటించినా కానీ అలియా భట్ తో ఎన్టీఆర్ కు సీన్స్ ఉన్నాయి. ఈ విషయం ట్రైలర్ లోనే అర్ధమైంది. అయితే ఈసారి తనకే హీరోయిన్ గా చేస్తోంది. ఫిబ్రవరి 7న ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది.