ఈనెల 10న సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల రేట్ల అంశంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సినీ పరిశ్రమ పెద్దలు పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లపై ఓ కమిటీని వేసింది. గతనెల చిరంజీవి కూడా సీఎంను కలిశారు. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని ప్రకటించారు కూడా.

ఈనేపధ్యంలో ఫిబ్రవరి 10న సినీ ప్రముఖులు మరోసారి సీఎం జగన్‌ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జునతోపాటు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలు, సినీ ప్రముఖులు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినీ పరిశ్రమ అంశాలపై, ప్రభుత్వ పరంగా చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించినట్టు తెలుస్తోంది.

టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన రిపోర్టు, సినీ పరిశ్రమకు రాయితీలు, థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎల్లుండి భేటీపై రేపు మరోసారి సీఎంతో మంత్రి పేర్ని నాని చర్చిస్తారని తెలుస్తోంది.