బజ్: మహేష్ సినిమాలో బాలయ్య?

సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై ఇప్పటి నుండే ఆకాశాన్ని అంటే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసాక, తన డేట్స్ ను రాజమౌళికే కేటాయించనున్నాడు.

ఈ చిత్రంపై ఆసక్తికర అప్డేట్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ను మల్టీస్టారర్ గా మలచాలన్న కోణంలో రాజమౌళి భావిస్తున్నాడట. అది కూడా నందమూరి బాలకృష్ణతో చిత్రానికి ముఖ్యమైన పాత్రను చేయించాలని భావిస్తున్నాడు రాజమౌళి.

చిత్రంలో చివరి 40 నిమిషాల్లో కీలకమైన పాత్ర అది అని సమాచారం. నందమూరి బాలకృష్ణ, మహేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు చాలా కొత్తగా, ఇరు వర్గాల ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగించేలా ఉంటాయని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.