పవన్ సంగతి సరే.. ప్రభాస్ ని అయినా సపోర్ట్ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా సంచలనం `భీమ్లానాయక్`. బారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఏపీ టికెట్ ల వివాదానికి పరిష్కారం లభించి ఈ చిత్రానికి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేటు పెంచుకునే వెసులు బాటుని కలిగించి వుంటే సినిమా కలెక్షన్స్ మరో రేంజ్ లో వుండువని ఇప్పటికే చర్చ జరుగుతోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత థీయేటర్లలోకి వస్తున్న భారీ చిత్రం `రాధేశ్యామ్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువీ క్రియేషన్స్ టీ సిరీస్ సంస్థలు అత్యంత భారీ స్థాయిలో ఐదు భాషల్లో రీజ్ చేయబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 11న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓ విజువల్ వండర్ గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వబోతోంది.

ఈ నేపథ్యంలో ఏపీ టికెట్ జీవో ఆసక్తికరంగా మారింది. ఇటీవల టికెట్ రేట్లు పెంచుకునే విధంగా వెలసులు బాటు కల్నించాలని కోరుతూ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి – ప్రభాస్ – మహేష్ బాబు – రాజమౌళి – కొరటలా శివ తదితరులు ఏపీ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు జీవో జారీ కాలేదు. పవన్ కల్యాణ్ `భీమ్లానాయక్` రిలీజ్ ముందైనా ఈ జీవో వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ అది జరగలేదు.

మరి ప్రభాస్ సినిమా `రాధేశ్యామ్` విడుదలకు ముందైనా ఏపీ ప్రభుత్వం సవరించిన టికెట్ ధరలకు సంబంధించిన జీవోని విడుదల చేస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. మార్చి 11న `రాధేశ్యామ్` విడుదల కాబోతోంది. దీనికి ముందు ఏపీ ప్రభుత్వం జీవోని విడుదల చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా జరగని పక్షంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన `రాధేశ్యామ్` నష్టాలని చవిచూడాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇంతకు ముందు జరిగిన మీటింగ్ అనంతరం ఏపీ ప్రభుత్వం భారీ చిత్రాలకు అది కూడా వంద కోట్లు మించి బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు రెండు వారాల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటుని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు దీనికి సంబంధించిన జీవోని విడుదల చేయలేదు. `రాధేవ్యామ్` రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలంతా ఏపీ జీఓ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి అంతా ఎదురుచూస్తున్నట్టే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు సంబంధించిన జీవోని విడుదల చేసి ప్రభాస్ కు అండగా నిలుస్తుందా? లేక మరో సాకుతో తప్పించుకునే పని చేస్తుందా? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.