#సామ్.. నా మంచి నేస్తమా నిన్ను విడువనురా!

కొన్ని పరిణామాలు .. లైఫ్ జర్నీలో సహజం. అయితే ప్రతిరోజూ కలతతో నలతతో ఉండడం కుదరదు. జర్నీ ముందుకు సాగాలి. వెళ్లే దారిలో మంచి చెడులను కలుపుకుంటూ వెళుతూ తమకు మంచి దారి ఎలా ఉందో వెతకాలి. ఇప్పుడు సమంత చేస్తున్నది అదే. తన చుట్టూ మంచిని ప్రోది చేసుకుంటోంది. కెరీర్ పరంగా ప్రణాళికల్ని రచిస్తూ పని ఒత్తిళ్లను మ్యానేజ్ చేసేందుకు తనకు ఉన్న మంచి హాబీ ఏంటంటే.. పప్పీస్ తో ఆటలాడుకోవడం.

మూగజీవాలతో సాన్నిహిత్యం చాలా వరకూ ఒత్తిడిని తొలగిస్తుంది. ముఖ్యంగా తన పెళ్లి ముందు నుంచి స్నేహంగా ఉన్న హాష్ అంటే సమంతకు ప్రాణం. హాష్ తో పాటు సాషా కూడా తన పెట్ కిడ్స్ లో ఉంది. తన కన్నబిడ్డల కంటే ఇవి చాలా ఎక్కువ సామ్ కి. నిరంతరం వాటిని ముద్దు చేస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. సమంతా తన పెంపుడు జంతువులైన సాషా – హష్ లతో సమయం గడుపుతున్నందున తాను మార్నింగ్ పర్సనాలిటీ అని చెప్పకనే చెప్పింది.

సమంత తన ఇద్దరు కిడ్డీ స్నేహితులైన హష్ – సాషాతో కలిసి ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ ను అత్యంత ఆరాధనీయమైన ఫోటోతో ఆకర్షితుల్ని చేసింది. పెంపుడు జంతువులు రెండూ సామ్ ఒడిలో వేకువఝామున ఆనందంగా తుళ్లిపడుతుస్తున్నాయి. సాషా ఆ అందమైన చిన్న కళ్లతో సమంతను చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. సామ్ ఈ పోస్ట్ కి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. హాష్ ఫ్రెంచ్ బుల్ డాగ్ అయితే.. సాషా ఒక పిట్-బుల్. ఈ అందమైన కిడ్స్ తో కలిసి సమంత తరచూ క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా సమంత ఇటీవలే ఇండస్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ గొప్ప స్థానానికి.. మరపురాని మైలురాయిని చేరుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎత్తుపల్లాలను చవి చూసింది. తన సోషల్ మీడియాలో ఒక నోట్ ను కూడా రాసింది. తన ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఇలా రాసింది.

కెరీర్ కీలక మలుపులో సామ్..!

నేటి పోటీవాతావరణంలో నిలదొక్కుకుని అగ్ర నాయికగా హోదాను కాపాడుకోవడం అంటే ఆషామాషీ కాదు. పైగా నేటి ప్రేక్షకులు ఎప్పటికప్పడు కొత్తందాల్ని కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పైగా ర్యాంప్ నుంచి నేరుగా రంగుల ప్రపంచంలో అడుగుపెట్టే భామలకు కొదవేమీ లేదు. ఇలాంటి కాంపిటీషన్ లో నేటితరంతో పోటీపడుతూ ఎప్పటికప్పుడు తమను తాము నిలబెట్టుకోవడం అంటే అదో పెద్ద సవాల్. కానీ అన్ని సవాళ్లను అధిగమించింది సమంత రూత్ ప్రభు.

తనదైన ప్రతిభతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా ఫ్లాపులు ఎదురైనా ప్రతి సందర్భాన్ని ఎంతో ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొంది. తెలివైన ప్రణాళికలతో తనని తాను నిలబెట్టుకుంది. మొత్తానికి వ్యక్తిగత జీవితంలో కలత నుంచి కూడా బయటపడుతోంది. ఇటీవల వరుస సినిమాలతో సమంత బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అటు జాతీయ స్థాయిలో వెబ్ సిరీస్ లు సినిమాలపైనా దృష్టి సారించింది.

ఏమాయ చేశావే చిత్రంతో సరిగ్గా 12ఏళ్ల క్రితం టాలీవుడ్ కి పరిచయమైన సమంతకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `యశోద` టీమ్ ప్రత్యేకించి సమంతకు శుభాకాంక్షలు చెబుతూ సెలబ్రేషన్ ని ప్లాన్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సమంత కూడా గర్భిణీ పాత్రలో నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సామ్ నర్సు పాత్రను పోషిస్తున్నట్లు కథనాలు వచ్చినా కానీ ఇప్పుడు గర్భిణిగా ప్రయోగం చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుందట.

ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య 369- సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.