సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు రెగ్యులర్ గా షేర్ చేయడం.. ఆ పోస్ట్ లు రెగ్యులర్ గా వైరల్ అవ్వడం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి సమంత ఇన్ స్టా లో షేర్ చేసిన పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ లో చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులు జరుగుతు ఉంటాయి.
కాని సమంత మాత్రం తనకు ఆప్తులు అనుకున్న వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.
సమంత పుట్టిన రోజు శుభాకాంక్షల్లో కాస్త ఎమోషన్ కూడా కనిపించింది. 2012 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన గురించి సమంత చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను చాలా లో గా ఉన్నాను. కెరీర్ పై ఆశలు వదిలేశాను. నేను చాలా నమ్మకం కోల్పోయాను.
ఆ సమయంలో మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు… మీరు నాకు ఆత్మ విశ్వాసంగా మారారు. మీ విలువైన సమయంను నా కోసం కేటాయించి ప్రతి రోజు నాతో మాట్లాడి తిరిగి నా ఆత్మవిశ్వాసంను దక్కించుకునేలా చేశారు.
ఆ సమయంలో నేను మళ్లీ వర్క్ లోకి దిగాను అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన స్ఫూర్తి. ఎప్పటికి కూడా నేను మీయొక్క స్ఫూర్తిని మర్చి పోలేను. ప్రతి సందర్బంలో కూడా మీ నుండి అందిన ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్తున్నాను.
నాకు మీరు వెన్నంటి ఉండి నడిపించిన ప్రతి ఒక్క క్షణం కూడా గుర్తుంది అంటూ నందిని రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ అయ్యింది. అదే సమయంలో సమంత తన స్నేహితురాలు నందిని రెడ్డితో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
సమంత మరియు నందిని రెడ్డి లు మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు జాయింట్ వెంచర్ లు కూడా చేయడం జరిగింది.
ముందు ముందు కూడా వీరి కాంబోలో సినిమాలు వస్తాయి అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఓ బేబీ సినిమాలో సమంత ను అద్బుతంగా చూపించిన క్రెడిట్ నందిని రెడ్డికి దక్కింది.
సామ్ జామ్ షో ను నందిని రెడ్డి పర్యవేక్షించిన విషయం తెల్సిందే. ఇక సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సమయంలో కూడా నందిని రెడ్డి స్నేహితురాలిగా ఆమెకు చాలా మనోధైర్యంను ఇచ్చి వెన్నంటి నిలిచింది అనేది టాక్. వీరిద్దరు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ ల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. సమంతకు ఇండస్ట్రీలో ఉన్న తక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో ఈమె ఒకరు అనడంలో సందేహం లేదు.