మాస్ మహారాజా రవితేజ మునుపెన్నడూ లేని విధింగా సినిమా విషయంలో స్పీడు పెంచారు. ఒక మూవీ రిలీజ్ కాగానే మరో మూడు చిత్రాలని లైన్ లో పెట్టేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ వరుస చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ప్రస్తుతం వరుసగా నాలుగు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వున్నారు. ఇందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో మూడు చిత్రాలు షూటింట్ దశలో వున్నాయి.
అందులో త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ధమాకా’ ఒకటి. మాస్ మహారాజా రవితేజ మార్కు వుంటూనే ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది ట్యాగ్ లైన్. ‘పెళ్లి సందD’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో వరుసగా నాలుగు కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా సాంగ్స్ షూట్ కోసం స్పెయిన్ వెళ్లింది.
హైదరాబద్ లో రీసెంట్ గా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలని ఫైట్ మాస్టర్స్ ‘రామ్ – లక్ష్మణ్ ల నేతృత్వంలో పూర్తి చేసిన చిత్ర బృందం తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లింది. అక్కడ హీరో హీరోయిన్ లపై డ్యాన్స్ మాస్టర్ శేఖర్ వీజే నేతృత్వంలో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ప్లాజాడే ఎస్పానా లో ఈ పాటని చిత్రీకరించారు. స్పెయిన్ లోని అత్యంత పాపులర్ ప్రదేశమైన మోరియా లూసియా పార్క్ సమీపంలో వున్న ప్లాజాడే ఎస్పానా చరిత్రాక ప్రాంతం. ఇక్కడే చాలా ఇండియన్ సినిమాల షూటింగ్ లు జరిగాయి.
అలాంటి ప్రత్యేకమైన ప్రదేశంలో ‘ధమాకా’ కోసం చిత్ర బృందం పాటని చిత్రీకరిస్తోంది. అంతే కాకుండా రొయాంటిక్ సాంగ్ లకు ఇది చాలా ప్రత్యేకమైన ప్లేస్ కావడంతో ‘ధమాకా’ కోసం చిత్రీకరిస్తున్న సాంగ్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ‘క్రాక్’ ఫేమ్ జిరాగ్ జైన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఘట్టమనేని కెమెరా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల.
రవితేజ ఈ సినిమాతో పాటు రావణాసుర టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర’ ఇటీవలే ప్రారంభమైంది. ఐదు గురు క్రేజీ భామలు ఇందులో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.
స్టూవర్ట్ పురం దొంగ బయోపిక్ ఆధారంగా రూపొందనున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి వుంది. వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మించబోతున్నారు.