అమీర్ ఖాన్ సినిమా నుంచే రాజమౌళి చాలా నేర్చుకున్నాడట

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడున్నరేళ్లుగా ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న విడుదలవుతోంది. సాధారణంగా ప్రతీ సినిమా 2డీలో విడుదలవుతుంటుంది. అయితే ఇన్నేళ్లు ప్రేక్షకుల్ని వేయిట్ చేయించిన రాజమౌళి ఈ మూవీతో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.

2డీ వెర్షన్ తో పాటు ఈ మూవీ 3డీ ఫార్మాట్ లోనూ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగించబోతోంది. అంతే కాకుండా ఐమాక్స్ వెర్షన్ ని కూడా ఒకే రోజు విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానులు సినీ లవర్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ `ఆర్ ఆర్ ఆర్` సెలబ్రేషన్స్ కి సిద్ధమైపోతున్నారు. రిలీజ్ మరో 4 రోజులే వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతోంది. ఏ చిన్న ప్లాట్ ఫామ్ ని కూడా వదలకుండా ఆర్ ఆర్ ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారు.

ఇటీవల కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహించిన చిత్ర బృందం ఆదివారం ఢిల్లీలో ప్రత్యేకంగా భారీ ఈవెంట్ ని నిర్వహించారు. ముందు నుంచి రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ టీమ్ లోకి మరోసారి బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ వచ్చి చేసింది. ఇప్పటికే టీమ్ దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించేశారు.

తాజాగా చిత్ర బృందం ఢిల్లీలో ఈవెంట్ ని నిర్వంహించింది. ఈ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ఖాన్ హాజరయ్యారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలిసి అమీర్ ఖాన్ సందడి చేయడంతో ఈ వెంట్ హైలైట్ గా మారింది. ఇదే ఈ వెంట్ లో అలియాభట్ కూడా పాల్గొంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ అలియాభట్ లతో కలిసి అమీర్ ఖాన్ హంగామా చేశారు. చరణ్ ఎన్టీఆర్ లు నాటు నాటు పాట స్టెప్ లు నేర్పడంతో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ హీరోలతో కలిసి ఈ పాటకు స్టెప్పులేసి సర్ ప్రైజ్ చేయడం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదే వేదికపై రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ అలియా కలిసి అమీర్ ఖాన్ తో సెల్ఫీ తీసుకోవడం విశేషం. ఇదిలా వుంటే అమీర్ ఖాన్ పై రాజమౌళి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పాన్ ఇండియా లో మొట్టమొదటి సినిమాగా నిలిచిన ఓ మూవీ నుంచి తాను చాలా నేర్చుకున్నానన్నాడు.

నేను సినిమాలు చేస్తున్నాను. అవి నాలుగైదు భాషల్లో విడుదలవుతున్నాయి. కానీ అప్పట్లో ఒక్క హిందీలో తీసిన `లగాన్` సినిమా దేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. నా దృష్టిలో అదే తొలి పాన్ ఇండియా మూవీ అని చెప్పి అమీర్ ఖాన్ ని షాక్ కు గురిచేశారు రాజమౌళి.