మంచు విష్ణు వెంట పడిన సన్నీలియోన్!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ టెంప్టింగ్ ఫోటోలు..వీడియోల ట్రెండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సన్నిలియోన్ ఫోటో పోస్ట్ చేసినా..వీడియో పోస్ట్ చేసినా నెట్టింట వాయు వేగతంతో దూసుకుపోతుంది. అంతర్జాలంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నిలియోన్ కి ఉన్న క్రేజ్ కారణంగానే అది సాధ్యమవుతుందన్నది అందరికీ తెలిసిన విషయం.

అలాగే యువతలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ గల నటి కూడా. ఇటీవలే హబ్బీ తో కోర్టులో బాస్కెట్ బాల్ ఆడిన వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎర్ర చీర కట్టి.. కొంగుని నడుము బిగించి మరీ బంతాట ఆడింది. తాజాగా సన్నిలియోన్ మరో వీడియోతో హట్ టాపిక్ గా మారింది. ఈసారి ఏకంగా తెలుగు హీరో మంచు విష్ణుని ఎంపిక చేసుకుంది.

సన్నిలియోన్ గోడ చాటున ఫేస్ మాస్క్ ధరించి నిలబడింది. ఇంతలో అటుగా వస్తోన్న విష్ణుని ఒక్కసారిగా ఆచాటు నుంచి బయటకు వచ్చి భయపెట్ట ప్రయత్నం చేసింది. అప్పుడు విష్ణు భయటపడలేదు. మాస్క్ తీసి సన్ని ముఖాన్ని చూసే సరికి అక్కడి నుంచి దౌడ్ అందుకున్నాడు. వెనుకా ముందు చూసుకోకుండా లగేత్తాడు. అలాగని సన్నిలియోన్ అతన్ని విడిచిపెట్టలేదు.

అంతే పరుగు వేగంతో విష్ణుని వెంబడించింది. ఇద్దరు చివరికి ఒక రైట్ టర్న్ తీసుకున్నట్లు వీడియో కనిపించింది. మరీ ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక. ఈ సరదా వీడియోని సన్నిలియోన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. మరి టాలీవుడ్ లో అంత మంది హీరోలున్నా..సన్నిలియోన్ విష్ణు వెంటే ఎందుకు పడింది? అంటే కారణం లేకపోలేదు.

మంచు కుటుంబంతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఉంది. మనోజ్ కథానాయకుడిగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించింది. అప్పటి నుంచి ఆ కుటుంబంతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఆ కారణంగానే ఇద్దరు ఇలా ఫన్నీ వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఇక మనోజ్ ‘మా ‘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి సన్నిలియోన్ ‘మా’ లో సభ్యత్వం తీసుకుందా? అన్నది తెలియాలి. ఇక నటిగా సన్నిలియోన్ వివిధ భాషల్లో బిజీగానే ఉంది.

‘ఓ మై గోస్ట్’ లో నటిస్తోంది. అలాగే ‘వీరమదేవి’ ..’రంగీలా’.’షెరో’ చిత్రాల్లో నటిస్తోంది. ‘వీరమదేవి’ సన్నిలియోన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం కావడం విశేషం. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.