ఎక్స్ క్లూజివ్: ఆచార్య ఈవెంట్ కు.. పవన్ కళ్యాణ్, కేటీఆర్. ?

మెగా మూవీ.. ఆచార్య ప్రీ ఈవెంట్ ను విజయవాడ లో చేస్తున్నారని.. దానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధి అని.. నిన్నటి దాకా మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా నడిచాయి..

నిజానికి ఈ వార్త లో నిజం లేకపోలేదు.. మాకున్న సమాచారం ప్రకారం.. మూవీ టీం.. ఈ దిశగా బాగా ప్రయత్నం చేసింది.. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ ఈవెంట్ కు రావటానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.. ఇది నిన్న సాయంత్రం వరకు జరిగిన ముచ్చట..

కానీ కారణాలు ఇంకా తెలియ రాలేదు కానీ.. నిన్న సాయంత్రం మళ్లీ ఈవెంట్ లొకేషన్ ప్లాన్ హైద్రాబాద్ కు మారినట్టు , ముందుగా అనుకున్నట్టు గానే.. హైద్రాబాద్ యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లోనే జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇక్కడ జరిగే ఈవెంట్ కు.. కె. టి. ఆర్ ను, పవన్ కళ్యాణ్ ను రప్పించటానికి మూవీ టీం నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది..

అయితే ఏది ఫైనల్ అనేది ఈరోజు సాయంత్రానికి గాని నిర్ణయం జరుగుతుందని మాకున్న సమాచారం.. బహుశా అతిథిగా వచ్చేవారి అనుకూలతను బట్టి.. విజయవాడలోనా లేక హైదరాబాద్ లోనా అనేది నిర్ణయం జరుగుతుందని భావించవచ్చు.. ఈ సందేహం తొలగటానికి అభిమానులు ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదు..