శిల్పాశెట్టి ఒడిలో కూర్చోవలనుకున్నావా అబ్బాయి?

హోటల్ బయట బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కారు వచ్చి ఆగింది. అప్పుడే హోటల్ లోపలి నుంచి శిల్పా శెట్టి..తన ఉమార్తె సమీషా శెట్టితోకలిసి బయటకు వచ్చింది. చుట్టూ బాడీ గార్డులు… ప్రదేశం రద్దీగా లేదు. శిల్పాశెట్టి కుమార్తెని నేలపై నడిపించుకుంటూ కారు వద్దకు వెళ్లింది. కారు డోర్ తీసి ప్రంట్ సీట్ లో కూర్చుంది. శిల్పా సహా కుమార్తె అందరీకి బై చెబుతున్నారు.

ఇంతలో బ్లాక్ షర్ట్ వేసుకుని ఓ అభిమాన వచ్చాడు. బౌన్సర్లలో కలిసిపోయాడు. శిల్పాశెట్టి కూర్చున్న సీటు ప్రంట్ డోర్ తీసి ఆమె ఒడిలో కూర్చోబోయాడు. దీంతో శిల్పా శెటి ఓయ్ ఏంటి? అని చిన్నగా అరించింది. దీంతో పాప పిల్లవాడి కల కల్లోలం అయింది. అప్పుడుగనుక శిల్పా శెట్టి ఏం మాట్లాడకుండా ఉంటే గనుక శిల్పా శెట్టి ఒడిలో కూర్చునే వాడేమో! అవును ఆ వీడియో చూస్తే ఇదే అనిపిస్తుంది.

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది. సృతి ఖన్నా కుమార్తె అనన్య పుట్టిన రోజు వేడుకలు ముంబైలోని జుహూ పార్టీ లోకేషన్ లో ఘనంగా జరిగాయి. ఈపార్టీకే శిల్పాశెట్టి డాటర్ తో కలిసి వె ళ్లింది. పార్టీ ముగించుకుని ఇంటికి బయల్దేరుతుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుంది.

అయితే అక్కడ అంత రద్దీ లేదు కాబట్టి శిల్పాశెట్టి కనీసం ఓ సెల్పీ అయినే ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆచాన్స్ తీసుకోలేదు. అభిమాని ప్రేమను అర్ధం చేసుకోలేకపోయింది. ఆ యువకుడిని నిరుత్సాహ పరిచింది. పాపం శిల్పాశెట్టి దగ్గర నుంచి ఎంత దూరం ప్రయాణించి వచ్చాడో.

అప్పుడప్పుడు సెలబ్రిటీలకు ఇలాంటి ఇక్కట్లు తప్పవు. అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందులకు గురవుతుంటారు. కొన్ని కొన్ని సార్లు బౌనర్లు వాళ్లని విసిరి పాడేస్తుంటారు. ఆ సమయంలో సెలబ్రిటీలు పట్టించుకోరు.

కొందరు హీరోలైతే చిరాకు పడుతుంటారు. ఇంకొందరైతే లాగి లెంపకాయలే వేస్తుంటారు. మరికొందరు మూడ్ బాగుంటే దగ్గరకు తీసుకుని హత్తుకుంటారు. అదే గనుక నిరుత్సాహంలో ఉంటే ‘అవతలికిపో అని’ కసురుంటారు. ఇవన్నీ సమహజమే. సినిమా వాళ్లని అతిగా ఆరాదించే వాళ్లకు ఇలాంటివి తప్పవు.