క్షేత్రస్థాయిలో పని చేసేదెవరో.. చేయనిదెవరో చూస్తున్నా: చంద్రబాబు

క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేస్తూ పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నేతలకు చెక్ పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

‘పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటాన్నే ఆయుధంగా చేసుకోవాలి. భయపడితే కోలుకోలేని దెబ్బ తింటాం. అండగా నేనుంటా. పనిచేసే వారెవరో.. చేయని వారెవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చింది. సీనియార్టీని గౌరవిస్తాం, గుర్తిస్తాం కానీ.. సీనియార్టీ ఉన్నా ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ప్రతిపక్షంలోనే ఉంటాం. పార్టీలో పని చేసే యువతను గుర్తిస్తాం. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సమాజ హితం కోసమే విరాళాలు సేకరిస్తున్నాం.

నారా లోకేశ్ మాట్లాడుతూ.. వాట్సాప్ ద్వారా కూడా సభ్యత్వ నమోదు చేస్తున్నాం. దీనిని కూడా ప్రభుత్వం అడ్డుకునేందుకు చూసింది. ఏకంగా వాట్సాప్ యాజమాన్యానికే 4పేజీల లేఖ రాశారు వైసీపీ నేతలు. టెక్నాలజీ వినియోగం ఎలానో తమను అడిగితే చూపిస్తామని వ్యంగ్యంగా అన్నారు.