సమంత ప్రయాణం ఇప్పుడెటు?

‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాటతో సమంత పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయింది. సమంత నడుం ఒంపు సొంపులకు అంతా ఫిదా అయ్యారు. ఉత్తరాదిన సమంత పేరు మారు మ్రోగిపోయింది. ఐటమ్ గాళ్ల్ గా హిందీ ఆడియన్స్ ని ఓ రేంజ్లో ఆకట్టుకుంది. సరిగ్గా కెరీర్ ని హిందీలో ప్లాన్ చేసుకుంటున్న సమయంలో వచ్చిన సక్సెస్ ఇది.

దీంతో అమ్మడు రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఇక సమంత హీరోయిన్ గా నటించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయింది. ఈ గ్యాప్ మొత్తాన్ని ఒక్క ఐటం పాటతో పుల్ ఫిల్ చేసేసింది. తాజాగా ఆమె తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈనెల 28న రిలీజ్ అవుతుంది. తెలుగులో ‘కేఆర్ కే’ టైటిల్ తో అనువాదమైంది.

ఇప్పటికే తమిళనాట ప్రచారం పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే తెలుగులో ప్రచారం మాత్రం చేయలేదు. ఆ బాద్యతలు సమంతపైనే నిర్మాతలు వేసినట్లు ప్రచారం సాగింది. కానీ సమంత థాయ్ లాండ్ చెక్కేసింది. దీంతో ప్రచారం పరిస్థితి ఏంటి? అని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే సామ్ తాజాగా మేహునా అంటూ దిగిపోయింది.

థాయ్ లాండ్ ట్రిప్ ముగించుకుని కొద్ది సేపటి క్రితమే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. టైట్ ఫిట్ దుస్తుల్లో టాప్ ని కవర్ చేస్తూ జీన్స్ షర్ట్ ధరించింది. కళ్లకి కూలింగ్ గ్లాసెస్ ధరించి..ముక్కుకి బ్లాక్ క్లామాస్క్ ధరించి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే సమంత నేరుగా ‘కేఆర్ కే’ ప్రమోషన్ లో భాగమవుతుందా? విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ పయనం అవుతుందా? అన్నది సందేహంగా మారింది. కొన్ని సోర్సెస్ సమంత కాశ్మీర్ వెళ్తుందని అంటున్నారు.

ఇటు ‘కే.ఆర్.కే ‘రిలీజ్ కి ఒక్క రోజే సమయం ఉంది. మరి సమంత పయనం ఎటు అన్నది క్లారిటీ రావాలి. విజయ్ దేవరకొండ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది.