రాజమౌళి సెంటిమెంట్ ను దాటలేకపోయిన కొరటాల శివ

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేసాక ఏ హీరోకైనా కొన్ని సినిమాల పాటు ప్లాప్ తప్పదు. ఇది ఈరోజు మాట కాదు. జక్కన్నతో సినిమా చేసిన హీరోలు ఎవరికీ కూడా వెంటనే మళ్ళీ హిట్స్ వచ్చింది లేదు. అయితే ఆ సెంటిమెంట్ ను రామ్ చరణ్, కొరటాల శివ బ్రేక్ చేస్తారని ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో గర్వంగా చెప్పాడు చిరంజీవి. ఆ సెంటిమెంట్ నిజం కాదని తాము నిరూపిస్తామని అన్నాడు.

కట్ చేస్తే… ఈరోజు ఆచార్య విడుదలైంది. టాక్ ఎలా ఉందో అందరూ చూసారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఏనా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు. ఆచార్యకు యునానిమస్ గా నెగటివ్ టాక్ వచ్చేసింది.

రిజల్ట్ గురించి అప్పుడే మాట్లాడకూడదు కానీ అడ్వాన్స్ బుకింగ్స్ నుండీ డల్ గానే ఉన్న ఆచార్య ఈ టాక్ తో హిట్ ట్రాక్ అంటే దాదాపు అసాధ్యమే. సో, రాజమౌళి సెంటిమెంట్ అలానే కొనసాగుతోంది.