స్నేహితురాలి కోసం ఒక సినిమా చేయబోతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తనకు సన్నిహితులు అయినా నిర్మాతలతో ఆయన సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తనతో చాలా కాలంగా ట్రావెల్ చేసిన కొందరికి సినిమాలు చేసేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవలే ఆయన కూతురు సుస్మిత కూడా తండ్రి తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గా ప్రచారం జరుగుతుంది. కూతురు కోసం సినిమా చిరంజీవి ఉచితంగా సినిమా చేయబోతున్నాడు అంటూ ఆ సినిమా గురించి వార్తలు ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి.

తాజాగా స్నేహితురాలు రాధిక కోసం ఒక సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేసేందుకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు రాధిక కాంబినేషన్ లో అత్యధిక సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవికి ఆప్తురాలిగా, ఫ్యామిలీ ఫ్రెండ్ గా కూడా రాధిక సుదీర్ఘ కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. కనుక ఆమె నిర్మాణ సంస్థ లో ఒక సినిమాని చిరంజీవి చేస్తాడని తెలుస్తోంది. రాధిక ఇటీవల ఆ విషయాన్ని అనధికారికంగా తెలియజేశారు. త్వరలోనే చిరంజీవికి సెట్ అయ్యే ఒక కథ ను రెడీ చేసి తీసుకు వెళ్లి వినిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. కథ ఓకే అయితే రాధిక నిర్మాణంలో చిరంజీవి హీరోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గతంలో చిరంజీవి రాధిక తో కలిసి చాలా సినిమాల్లో నటించాడు, ఇప్పుడు ఆమె నిర్మాణంలో నటించేందుకు ఓకే అన్నాడు కనుక ఎప్పటికి ప్రారంభం అవుతుందో చూడాలి.