మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 12వ తారీకున భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
ఈమద్య కాలంలో సినిమాలను ఎంత కష్టపడి తీస్తున్నారో అంతకు మించిన శ్రద్దతో కష్టపడి ప్రమోషన్ చేస్తున్నారు. సినిమాలను ప్రమోషన్ చేయకుంటే ఎంత మంచిగా ఉన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడాల్సిందే. అందుకే పెద్ద సినిమాలకు విడుదలకు ముందు కనీసం రెండు మూడు వారాల ముందయినా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా కు కూడా రెండు వారాల ముందే ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. కాని మహేష్ బాబు మాత్రం ఇంకా సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం లేదు. ఇంకా కూడా ఫ్యామిలీతో కలిసి పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాల్సిన మహేష్ బాబు ఇంకా అక్కడ ఉండటం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది ఎప్పుడు.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేది ఎప్పుడంటూ విసుక్కుంటున్నారు.