తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ గాంధీ రాకను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్వీట్స్ చేశారు. దీనికి ప్రతిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి కౌంటర్ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించగా.. రైతు వ్యతిరేక చట్టాలను ప్రధాని మోదీ తీసుకొచ్చినప్పుడు మీరెక్కడున్నారని రేవంత్ ప్రశ్నించారు. ‘మోదీ ముందు మీ తండ్రి మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు చేయలేనిది తెలంగాణలో మేమేం చేస్తున్నామో అధ్యయనం చేసేందుకు రాహుల్ వస్తున్నారు అని కేటీఆర్ ట్వీట్ చేయగా.. మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలి. రుణమాఫీ ఎలా ఎగ్గొట్టాలి.. ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి.. వరి, మిర్చి, పత్తి రైతులు ఎలా చస్తున్నారు. ఇవే కదా నిజాలు.. ఆ నిజాలు గట్టిగా చెప్పడానికే రాహుల్ వస్తున్నారు అని ట్వీట్ చేశారు.
https://twitter.com/RaoKavitha/status/1522404168987648000