బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హీరోయిన్ గా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. ఇంత బిజీగా ఉన్నా కూడా ఆమె ఇటీవలే పెళ్లి చేసుకుంది. యంగ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు అందరికి షాక్ ఇచ్చింది. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. కాని కత్రీనా గత ప్రేమ కథల మాదిరిగానే విక్కీ కౌశల్ తో సాగుతున్న లవ్ కూడా బ్రేకప్ అయ్యే అవకాశం ఉందనుకున్నారు.
కాని వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లితో తన అభిమానుల గుండెలను కత్రీనా బద్దలు కొట్టినంత పని చేసింది. హీరోయిన్ గానే కాకుండా ఆమెను వ్యక్తిగతంగా కూడా ఆరాధించే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు కత్రీనా పెళ్లి పీఠలు ఎక్కిన వెంటనే అయ్యో అంటూ గుండె బరువెక్కి పోయేలా ఫీల్ అయ్యారు.
ఇక పెళ్లి తర్వాత భర్త విక్కీ కౌశల్ తో ఈమె చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈమె భర్త విక్కీ కౌశల్ తో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసి ప్రతి ఒక్కరి గుండెలను మరోసారి కత్తితో గుచ్చినంత పని చేసిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు కత్రీనా స్విమ్మింగ్ పూల్ రొమాన్స్ ను వావ్ అంటున్నారు. భర్తతో హగ్ ను ఆమె ఆస్వాదిస్తున్నట్లుగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి కొందరు ఆమె భర్త మాత్రం ఎందుకు సీరియస్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. విక్కీ కౌశల్ అంతటి రొమాంటిక్ ఫోజ్ లో కూడా సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం ఏంటంటూ కొందరు సరదాగా మీమ్స్ చేస్తున్నారు.
మొత్తానికి కత్రీనా సోషల్ మీడియా సందడి మామూలుగా లేదు. ఇక హీరోయిన్ గా ఈ అమ్మడి జోరు మరింతగా ఉంది. తెలుగు లో ఈమె మల్లీశ్వరి మరియు అల్లరి పిడుగు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ల్లో కత్రీనా కైఫ్ ఆకట్టుకుంది. మళ్లీ తెలుగు లో ఈ అమ్మడు నటించలేదు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.