కేన్స్ 2022లో భారతీయ తారల సందడి పీక్స్ కి చేరుకుంది. ఇప్పటికే పలువురు తారల ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇక కేన్స్ వేదిక అంటే తొలిగా గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్. ఈ బ్యూటీ గడిచిన దశాబ్ధ కాలంగా కేన్స్ ఉత్సవాల్లో ప్రతియేటా సందడి చేస్తుండడం గమనించాం. ఈ ఏడాది కూడా ఐష్ ఈ వేడుకలను మిస్ చేయలేదు. యంగ్ బ్యూటీస్ కాంపిటీషన్ నడుమ ఐశ్వర్యా రాయ్ కూడా రెడ్ కార్పెట్ నడకలతో హొయలు పోయిన ఫోటోలు ఈడియోలు ఇప్పుడు అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి రెగ్యులర్‌గా హాజరవుతున్నారు. ఈసారి కేన్స్ ఉత్సవాలకు పూజా హెగ్డే- తమన్నా భాటియా- ఊర్వశి రౌటేలా- ఆర్ మాధవన్ తదితరులతో భారతీయ ప్రతినిధి బృందం ఒకటవ రోజు కనిపించిన తర్వాత.. అభిమానులకు మొదటిసారి ఐశ్వర్య రాయ్ ఈ ఫెస్టివల్ లో కనిపిస్తుందని ఆసక్తిగా ఎదురు చూసారు. ఎట్టకేలకు 2వ రోజు కేన్స్ లో తమ అభిమాన దేవత ప్రత్యక్షమైంది. ఐశ్వర్యరాయ్ పూర్తిగా గులాబీ రంగు దుస్తులలో ఉత్సవంలో కనిపించింది.
కేన్స్ 2022 లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ వాలెంటినో పింక్ ప్యాంట్ సూట్ లో కనిపించింది. తోటి లోరియల్ అంబాసిడర్ ఎవా లాంగోరియాతో కలిసి ఐశ్వర్య పోజులిచ్చిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కెమెరాలకు పోజులిచ్చారు.
తన ఫస్ట్ లుక్ కోసం ఐశ్వర్య వాలెంటినో ద్వారా ఫుచ్ సియా ప్యాంట్‌సూట్ ను ఎంపిక చేసుకుంది. ఆమె తన మోనోటోన్ లుక్ .. పింక్ హీల్స్ తో కనిపించింది. అయితే ఐష్ సహజంగా కనిపించే మేకప్ మినిమం ఉపకరణాలను ఎంచుకుంది. ఎవా మరోవైపు కార్సెట్ టాప్‌తో కూడిన ఆల్-గ్రీన్ దుస్తులను ఎంచుకుంది.
ఈ వారం ప్రారంభంలో అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఫ్రెంచ్ రివేరాకు బయలుదేరిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఐశ్వర్య ముంబై విమానాశ్రయంలో పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించింది. ఓవర్ కోట్ తో బ్లాక్ షర్ట్ లో ఎయిర్పోర్ట్ ఫ్యాషన్ గేమ్ లో ఆకర్షించింది.
అయితే కేన్స్ 2022లో ఐశ్వర్యారాయ్ షేపవుట్ అయ్యిందంటూ కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐష్ మునుపటిలా కనిపించడం లేదు. పూర్తిగా రూపం మారిపోయింది. ఇటీవల సినిమాల్లోనూ నటించడం లేదు కాబట్టి గ్లామర్ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టు లేదు!
అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐశ్వర్యారాయ్ ఏజ్ ఇప్పటికే 45. మునుముందు ఈ రూపం ఇంకెంతగా మారిపోతుందో అన్న ఆందోళన వ్యక్తమైంది. ఇక తమ అభిమాన తార ఐశ్వర్యారాయ్ ని ఇలా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా లేరు. తన నుంచి మునుపటి ఛామ్ ని కోరుకుంటున్నారు.