సుదీర్ఘ కాలంగా నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటూ కొన్ని వందల సార్లు వార్తలు మీడియాలో వచ్చాయి. ఇద్దరు సహ జీవనం సాగిస్తున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు నేడు పెళ్లి చేసుకుంటున్నారు. వైభవంగా వీరి వివాహ వేడుక జరుగుతోంది.
సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కావడం లేదు.. కాని ఇరు వైపుల కుటుంబ సభ్యులు మరియు నయన్ మరియు విఘ్నేష్ శివన్ ల యొక్క ఆత్మీకులు స్నేహితులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. పెళ్లి వేడుకను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్ దగ్గరుండి మరీ మానిటరింగ్ చేస్తున్నాడట. అక్కడ ఏర్పాట్లు మొదలుకుని లైవ్ కవరేజ్ ఇతర వీడియో రికార్డింగ్ విషయాలను ఆయన చూసుకుంటున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పెళ్లికి మరి కొన్ని గంటలు ఉండగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసి తాను నయనతార ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో నయనతారను పెళ్లి చేసుకోబోతున్నందుకు తాను చాలా అదృష్టవంతుడిని అంటూ పేర్కొన్నాడు. మొత్తానికి విఘ్నేష్ శివన్ మరియు నయనతార ల పెళ్లి కి ముందు ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విఘ్నేష్ శివన్.. ఈ రోజు జూన్ 9 నయనతార తో నా వివాహం. ఆ దేవుడికి.. నా యొక్క మంచి కోరే ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి మంచి వ్యక్తి.. ప్రతి మంచి క్షణం.. ప్రతి ఆశీర్వాదం.. ప్రతి రోజు నా జీవితాన్ని ఆనందంగా మార్చాయి.
మీరందరు మా కోసం చేసిన ప్రార్థన లకు కృతజ్ఞతలు. నయనతార.. మరికొన్ని గంటల్లో నీతో ఏడు అడుగులు వేయబోతున్నాను. నీతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన కొత్త జీవితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మన జీవితంలో ప్రతీది మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశాడు.
ఒక సాదారణ దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ ను నయనతార ప్రేమించింది అంటూ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది నమ్మలేదు. లేడీ సూపర్ స్టార్ అయిన నయన్ ఆయన్ను ప్రేమించడం ఏంటీ అంటూ అంతా నోరు వెళ్లబెట్టారు. చాలా మంది కూడా ఇద్దరి మద్య ప్రేమ ఇప్పుడు చిగురించినా కూడా ఖచ్చితంగా వారిద్దరు పెళ్లి వరకు అడుగులు వేయరు అని అన్నారు. వారందరికి కూడా ఇదే సమాధానం అన్నట్లుగా విఘ్నేష్ మరియు నయన్ ల పెళ్లి జరుగుతోంది.