సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇక్కడే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సౌత్ లో కంటే కూడా అధికంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.
హీరోయిన్ గా బాలీవుడ్ లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఈమె నటించిన రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న హిందీ సినిమాలు అయిదు ఆరు ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేయడం అనేది కామన్ విషయం. ఆమె ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయకుండా లేదు. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్స్ ల కారణంగానే బాలీవుడ్ లో ఇలా వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి అనేది ఒక వర్గం మీడియా వారి మాట.
తాజాగా షేర్ చేసిన ఫోటో కూడా కుర్రకారును ఫిదా చేస్తుంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కింది నుండి మీది వరకు కవర్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన క్లీవేజ్ షో చేయడంతో అంతా ఫిదా అవుతున్నారు. ఈమాత్రం చాలు అన్నట్లుగా సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ అందాల జాతర ఎప్పుడు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్లుగానే ఉంటుంది. బికినీ నుండి మొదలుకుని చీర వరకు ఏ కాస్ట్యూమ్ లో ఉన్నా కూడా జనాలు ఆమె గురించి చర్చించుకుంటూనే ఉన్నారు.
హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ ఆమె కెరీర్ కు మరియు సినిమా లకు చాలా ప్రయోజనం చేకూర్చుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.