మొదటిసారి కూతురిని చూపించిన హీరోయిన్


క్యూట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆమెకు ఎక్కువగా గుర్తింపు అందింది మాత్రం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతోనే.ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ కన్నడ చిత్ర పరిశ్రమలు అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేసింది. హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ప్రణీత సుభాష్ గత ఏడాది కరోనా సమయంలోనే ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది.

ఇక 2022 జూన్ నెలలో ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ప్రణీత సుభాష్ సోషల్ మీడియా ద్వారా తరచుగా తన ఫ్యామిలీ విశేషాలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే పాప పుట్టింది అనే శుభవార్త చెప్పిన ప్రణీత సుభాష్ ఎప్పుడూ కూడా ఆ చిన్నారి ఫోటోను మాత్రం పోస్ట్ చేసింది లేదు. ఇక మొదటిసారి ఆమె తన సోషల్ మీడియాలో చాలా సున్నితంగా తన గారాల కూతురిని అందరికి చూపించింది

అంతేకాకుండా ప్రణిత సుభాష్ తన పాప పేరును కూడా తెలియజేసింది. తన పేరు ఆర్నా అంటూ చాలా అందంగా ఉంది కదా అని సోషల్ మీడియాలో మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఆమె ఫాలోవర్స్ అయితే మీ కూతురు మీకంటే అందంగా ఉంది అంటూ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక పెళ్లి అయిన తర్వాత కూడా ప్రణీత సుభాష్ అయితే నటనకు గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. మొదట్లో ఈ బ్యూటీ సినిమాలకు దూరం కానుంది అని చాలా రకాల వార్తలు వచ్చాయి.

కానీ ఆమె భర్త సినిమాల్లో నటించడానికి ఎలాంటి షరతులు విధించలేదు అని ఎప్పటిలానే తన సినిమా ప్రయాణం కొనసాకానున్నట్లు ప్రణీత ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఒక రమణ అనే కన్నడ చిత్రంలోని ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించబోతోంది.