తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ లో కొత్త సీజన్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా నాగార్జునపై ప్రముఖ దర్శకుడు బిగ్ బాస్ కోసం ప్రోమోలను షూట్ చేయడం జరిగింది. ఈ వారం లేదా వచ్చే వారంలో ఆ ప్రోమోలో యూట్యూబ్ మరియు స్టార్ మా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ప్రోమో ల్లో బిగ్ బాస్ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో బిగ్ బాస్ యొక్క సెట్ నిర్మాణం పై కూడా నిర్వాహకులు శ్రద్ధ పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈసారి కూడా బిగ్ బాస్ కొత్త సీజన్ జరగబోతుంది. కాని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సెట్ ను విభిన్నంగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అంతే కాకుండా బిగ్ బాస్ గత సీజన్ ల్లో ఎదుర్కొన్న లీక్ లకు కూడా చెక్ పెట్టే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ప్లాన్ చేశారు.
వీకెండ్ ఎపిసోడ్ షూట్ కు హాజరు అయిన టెక్నీషియన్స్ మరియు ఇతర టీమ్ వల్ల లీక్ అవుతున్నాయి. అందుకే శనివారం ఎపిసోడ్ చిత్రీకరణ జరిగే సమయంలో అత్యంత సెక్యూరిటీని ఏర్పాటు చేయబోతున్నారట.
షూటింగ్ కు హాజరు అయిన ప్రతి ఒక్కరు కూడా లోపలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. తద్వారా ఎలిమినేషన్ ఎవరు అయ్యారు.. సోమవారం నాటి ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు అనే విషయాలు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ల్లో లీక్ లు ఉండబోవు అని స్టార్ మా వర్గాల వారు బలంగా చెబుతున్నారు.
బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులు ప్రతి సీజన్ ను బాగా ఆధరిస్తున్నారు. కనుక తప్పకుండా ఈ సీజన్ ఎప్పటిలాగే మంచి రేటింగ్ ని దక్కించుకుంటుందని అంటున్నారు. మొన్నటి వరకు స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ ఓటీటీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అందులో నుండి కొందరిని ఈ సీజన్ బిగ్ బాస్ కు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.