బన్నీతో సాయి పల్లవి..ఇంకా ఎన్నాళ్లిలా?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప-2’ షూటింగ్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు స్ర్కిప్ట్ అంతా రెడీ అయిపోయింది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తొలి భాగాన్ని మంచి ది బెస్ట్ అందించడానికి దేవి శ్రీ ప్రసాద్ రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. ఆయనతో పాటు దర్శకుడు సుకుమార్..పాటల రచయిత చంద్రబోస్ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురు విదేశాల్లో తిష్ట వేసి సంగీతం పనులు చూస్తున్నారు. మరోవైపు ది రూల్ క్యాస్టింగ్ పైనా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రెండవ భాగంలో చాలా కొత్త పాత్రలు పుట్టుకొస్తున్నాయని.. మొటిట భాగానికి కొనసాగింపు అయినా సుకుమార్ సినిమాటిక్ యూనివర్శతో రెండవ భాగంలో సరికొత్త పాత్రలతో కథను నడిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే శ్రీ వల్లి పాత్ర ద్వితియార్ధంలో చనిపోతుందని…ఆ పాత్ర స్థానంలో మరో హీరోయిన్ కనిపిస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సాయి పల్లవి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే మరికొన్ని బలమైన పాత్రలు సైతం తెరపై కనిపించనున్నాయని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఏది? వాస్తవం అన్నది క్లారిటీ లేదు గానీ..తాజాగా మరోసారి సాయి పల్లవి పేరు బలంగానే వినిపిస్తుంది.

పార్ట్ -2లో సాయి పల్లవి చిత్తూరు అడవుల్లో కనిపించే గిరిజన యువతి పాత్రలో కనపించనుందని అంటున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ ..సిండికేట్ నిర్వాహకుడు పుష్పరాజ్ కి చిత్తూరు అడవుల్లో ఈ పాత్ర తారసపడుతుందిట. ఆ పాత్రతో బన్నీ కొత్త ప్రేమాయాణం మొదలవుతుందని సమాచారం. అయితే ఆ ప్రేమ పూర్తి స్థాయిలో కనిపించదని కేవలం 20 నిమిషాలకే ఆ పాత్రని పరిమితం చేస్తున్నట్లు వినిపిస్తుంది.

ఎలాంటి మేకప్ లేకుండానే సుకుమార్ సాయి పల్లవిని తెరపైకి తీసుకొస్తున్నారని లీకులందుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అన్నది చిత్ర బృందం ధృవీకరిస్తే తప్ప క్లారిటీ రాదు. నిజంగా ఇలాంటి పాత్రని సుకుమార్ సృష్టిస్తే గనుక ఆపాత్రకి సాయి పల్లవి జీవం పోస్తుందని చెప్పాల్సిన పనిలేదు.

ఇటీవలే ‘విరాట పర్వం’లో వెన్నెల పాత్రతో ఆద్యంతం ఆకట్టకుంది. ఎంతో నేచురల్ పెర్మార్మన్స్ అందించింది. ఉమెన్ సెంట్రిక్ చిత్రమా? అనిపించింది. అంతగా ఆ పాత్రలో లీనమై ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం సాయి పల్లవి వేర్వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.