బిగ్ బాస్ 6 : ఆ ఇద్దరిలో ఒకరు ఫస్ట్ ఔట్?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. నేడు మరియు రేపు వీకెండ్ ఎపిసోడ్స్ ప్రసారం కాబోతున్నాయి. మొదటి వారంలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిని సస్పెన్స్ లో ఉంచి చివరి వరకు ఆ సస్పెన్స్ ను కంటిన్యూ చేసి చివరకు ఏ ఒక్కరిని ఈ వారం ఎలిమినేట్ చేయడం లేదు అంటూ నాగార్జున షాకింగ్ కబురు చల్లగా చెప్పి వెళ్లి పోయాడు.

ఇక రెండవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్స్ అంతా ఒకొక్కరి చొప్పున నామినేట్ చేయమని.. కెప్టెన్ మాత్రం ఇద్దరిని ఎలిమినేట్ చేసేందుకు నామినేట్ చేయమంటూ బిగ్ బాస్ సూచించాడు. అలా నామినేషన్ లోకి రేవంత్.. అభినయ శ్రీ.. ఆదిరెడ్డి.. గీతూ రాయల్.. మెరీనా-రోహిత్ మరియు ఫైమాలు వచ్చారు.

ఆ ఆరుగురితో పాటు కెప్టెన్ తన యొక్క ప్రత్యేక పవర్ తో మరో ఇద్దరిని ఎలిమినేషన్ లో నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో కెప్టెన్ బాలాదిత్య రాజశేఖర్ మరియు షానీ సాల్మన్ ను నామినేట్ చేయడం జరిగింది. ఈ ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది నేడు రాత్రి వరకు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇద్దరి పేర్లు మాత్రం చాలా మంది ఊహిస్తున్నారు.

ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల్లో రేవంత్ కి అత్యధికంగా ఓట్లు పడ్డాయి అంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రేవంత్ తర్వాత అత్యధిక ఓట్లను ఫైమా పొందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ మరియు ఫైమాలకే ఏకంగా 60 శాతం ఓట్లు పోల్ అయ్యాయట.

ఇప్పటికే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓట్లు అధికంగా దక్కించుకున్న వారిలో గీతూ రాయల్ మరియు ఆదిరెడ్డి లు కూడా ఉన్నారు. వీరిద్దరు మూడు నాల్గవ స్థానంలో ఉంటారని సమాచారం అందుతోంది. ఇక మెరీనా-రోహిత్ మరియు రాజశేఖర్ లు కూడా ఎలిమినేట్ అవ్వకుండా మంచి ఓట్లు దక్కించుకుని ఉంటారు. ఇప్పుడు అభినయ మరియు షానీ సాల్మన్ లే డేంజర్ జోన్ లో ఉన్నారు.

వీరిద్దరిలో కూడా అభినయ కాస్త ఎక్కువ ఓట్లు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది.. అది అతి త్వరలోనే లీక్ ద్వారా మన వరకు వచ్చే అవకాశం ఉంది. నేటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది. కనుక మరి కాసేపట్లో అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.