`ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా వైడ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల వసూళ్లతో ఇండియాన్ సినిమా రికార్డులో రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఓటీటీ వేదికగా విదేశాల్లో సైతం సత్తా చాటిన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చిన కళాఖండంగా కీర్తింపబడింది. బ్రిటన్ సామ్రాజ్యంతో రామ్-భీమ్ పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది.
సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు విదేశాల నుంచి నటుల్ని దిగుమతి చేసారు. గ్లోబల్ స్థాయిలో సినిమా రీచ్ అయిందంటే? దాని వెనుక విదేశీ నటుల ప్రతిభ ఎంతో కీలకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బ్రిటన్ కి చెందిన కొందరు మాత్రం తీవ్ర స్థాయిలో సినిమాని విమర్శిస్తున్నారు. సినిమాలో తమని తక్కువగా చూపించారంటూ బ్రిటీషర్లు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై రాజమౌళి ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు. `విలన్ పాత్రలో బ్రిటన్ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటీషర్లుందర్నీ విలన్లుగా చూపించినట్లు కాదు. అలా అనుకుని ఉంటే బ్రిటన్ లో ఆర్ ఆర్ ఆర్ ఎలా విజయం సాధిస్తుంది. అక్కడి ప్రేక్షకులు సైతం మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచిందంటే దాని వెనుక వాళ్ల హస్తం ఉంది.
అందరూ `ఆర్ ఆర్ ఆర్` ని వ్యతిరేకిస్తే అక్కడ విజయ సాధించేది కాదు. సినిమా ప్రారంభానికి ముందు వచ్చే డిస్క్లైమర్ చూసే ఉంటారు. ఒకవేళ అది మిస్ అయినా సమస్య లేదు ఎందుకంటే? ఆర్ ఆర్ ఆర్ అనేది పాఠం కాదు. అదొక కథ. ఈ విషయం సినిమాలో విలన్..హీరోలుగా నటించిన వారికి తెలుసు. ప్రేక్షకులకు ఎలాగూ అర్ధమవుతుంది.
ఓస్టోరీ టెల్లర్ గా ఇవన్నీ అర్ధమైతే? ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన పని ఉండదు` అని అన్నారు. మొత్తానికి భారత్ ని పాలించిన బ్రిటీషర్లు కొందరు తమని ఇంకా తప్పుగా చూపించామని భావించడం శోనీయం. ఇంత వరకూ రాని విమర్శలు ఇప్పడు తెరపైకి రావడం ఆసక్తికరం. మరి రాజమౌళి తాజా వ్యాఖ్యలపై బ్రిటీషర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.`ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్…అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే.