బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని అందించిన కాంబినేషన్ లు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే చూడాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తుంటారు. మళ్లీ ఇద్దరు కలిసి అదే తరహా మ్యాజిక్ చేయాలని కోరుకుంటుంటారు. అలా కోరుకుంటున్న బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి మరోసారి సని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు మూడు హిట్ సినిమాలొచ్చాయి.
2020 జనవరి 12న క్రాంతి బరిలో నిలిచిన `అల వైకుంఠపురములో` సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీగా సరికొత్త రికార్డుని సొతంం చేసుకుంది. ఆడియో పరంగా కూడా తమన్ అందించిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచి ఈ మూవీ నెట్టింట వైరల్ గా ట్రెండ్ అయ్యేలా చేసింది. అంతే కాకుండా బిగ్ బ్యాంగ్ లాంటి రికార్డు బ్రేకింగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో బన్నీకి ఈ మూవీతో తిరుగులేని విజయం లభించడం విశేషం.
ఇదిలా వుంటే ఈ సంచలన బ్లాక్ బస్టర్ తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి మరో సినిమాకు రెడీ అవుతున్నారట. ఇది వీరి కలయికలో రానున్న నాలుగవ ప్రాజెక్ట్. ఫ్యాన్స్ కూడా వీరిద్దరి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో సినిమా రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ వార్త నిజంగా బన్నీ ఫ్యాన్స్ కి పండగే అని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `పుష్ప` సీక్వెల్ ని పట్టాలెక్కించే పనుల్లో బిజీగా వున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ పాన్ ఇండియా సీక్వెల్ ని నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ ని అక్టోబర్ 1 నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆరోజు `అల్లు స్టూడియోస్` ప్రారంభం కానున్న నేపథ్యంలో `పుష్ప 2`ని కూడా అక్కడే మొదలు పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది.