సోషల్ మీడియా ప్రభావం మొదలయ్యాక ప్రతీదీ వైరల్ అవుతోంది. ఇదుగో పులి అంటే అదుగో తోక అనే వార్తలు ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్నాయి. ఇక క్రేజీ ప్రాజెక్ట్ ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతీ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో SSMB29 కూడా చేరింది. దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే.
కరోనా టైమ్ లో దాదాపు రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ ని ఓ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భిన్న కథనాలు వినిపిస్తూనే వున్నాయి. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుండటంతో నటీనటులు సినిమా నేపథ్యంపై రక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ ప్రాజెక్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ ని ఇటీవలే పూర్తి చేశారు. దసరా తరువాత కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీపైనే ప్రస్తుతం మహేష్ ప్రత్యేక దృష్టిపెట్టాడు. దీని తరువాతే రాజమౌళి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ పై భిన్నమైన కథనాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి తెరపైకి తీసుకురానున్నారట.
అయితే ఇంత వరకు ప్రీ ప్రొడక్షన్ వర్కే మొదలు పెట్టలేదు అప్పుడే ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన రక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో మహేష్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా నటిస్తుందంటే.. మరి కొంతదరు మాత్రం హాలీవుడ్ నటి ఐజా గొంజాలెజ్ నటిస్తందని ప్రచారం చేస్తున్నారు. ఇక మరో అడుగు ముందుకేసి ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో `థోర్` ఫేమ్ క్రిష్ హోమ్స్మార్త్ నటిస్తారని ప్రచారం చేస్తున్నారు.
మహేష్ క్రిష్ హోమ్స్మార్త్ ఫొటోలని షేర్ చేస్తూ ప్రచారం మొదలవుడంతో నెటిజన్ లు ఈ ప్రాచారంపై గట్టిగానే కౌంటర్ ఇస్తూ ట్రోల్ చేస్తున్నారు. క్రిష్ హోమ్స్మార్త్ రెమ్యునరేషన్ తో ఏడాది పాటు మన తెలుగు సినిమాలు నిర్మించొచ్చని మరీ ఈ రేంజ్ స్కూప్ లేంట్రా కొంచెం బుర్ర వాడండ్రా .. అంటూ నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. ఇక క్రిష్ హోమ్స్మార్త్ తో పాటు థానోస్ పాత్రధారి జోష్ బోర్లిన్ శామ్ జాక్సన్ ల పేర్లని కూడా ప్రముఖంగా ప్రచారం చేస్తుండటంతో చాలా మంది నెటిజన్ లు చిత్ర విచిత్రమైన ఎమోజీలతో పాటు బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్ కి సంబంధించి ఫొటోలని షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి రూమర్స్ రోజు రోజుకీ పుట్టుకు రావండం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.