ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 బ్లాక్ బస్టర్ విజయంలో సమంత ప్రధాన భూమికను పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో రాజీ అనే ఎల్.టి.టి.ఇ తీవ్రవాది పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. ఈ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ని తన పాదాక్రాంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ కర్తలు రాజ్ అండ్ డీకేతో సమంత మరో వెబ్ సిరీస్ చేస్తోందనగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లకు సంతకాలు చేస్తోంది. ఇప్పుడు కొత్త OTT ప్రాజెక్ట్ కోసం హెడ్ లైన్స్ లోకొస్తోంది. రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ లో సమంత హ్యాండ్సమ్ హంక్ వరుణ్ ధావన్ తో రొమాన్స్ చేయనుంది. నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. పైన పేర్కొన్న సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్ కి భారతీయ వెర్షన్.ఈ ప్రాజెక్ట్ కి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నందున లీడ్ పెయిర్ అందుకు అవసరమైన రూపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సిరీస్ కోసమే ఇటీవల సమంత అమెరికా వెళ్లిందని కూడా టాక్ వినిపించింది.
నాయకానాయికలు పూర్తిగా టోన్డ్ లుక్ లో కనిపించాలని రాజ్ అండ్ డీకే కోరారట. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్ – డికెతో సామ్ చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. మరోసారి ఈ కాంబినేషన్ సెన్సేషన్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇతర కమిట్ మెంట్లు స్పీడ్ గా..సమంత ఇటీవల వరుసగా బాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేస్తోంది.రాజ్ అండ్ డీకే ప్రాజెక్టుతో పాటు.. ప్రముఖ ఫిలింమేకర్ దినేష్ విజన్ తదుపరి చిత్రంలో నటించేందుకు సమంత అంగీకరించింది. స్త్రీ- భేదియా – ముంఝా తర్వాత అతడి నుంచి హారర్ కామెడీ రానుంది. మాడాక్ ఫిల్మ్స్ లో ఇది వరుసగా నాల్గవ చిత్రం అవుతుంది.
సమంతా రూత్ ప్రభు ఇందులో యువరాణిగా నటించనున్నారని కథనాలొచ్చాయి. ఈ హారర్-కామెడీలో ఆయుష్మాన్ ఖురానా పిశాచి పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ కోసం నిర్మాత దినేష్ విజన్ సమంతా రూత్ ప్రభుని సంప్రదించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కి సమంత అధికారికంగా సంతకం చేసినట్లు తెలుస్తోంది. హారర్-కామెడీ విశ్వాన్ని (యూనివర్శ్) నడిపించే ఈ చిత్రంలో తారలంతా ఫాంటసీ పాత్రలను పోషిస్తారు. తాజా కథనాల ప్రకారం..ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తారు. నిరేన్ భట్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.
ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో కలిసి సామ్ వర్క్ షాప్ లలో పాల్గొంది. రాజస్థాన్ నేపథ్యంలో మరో జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని సామ్ ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా అలాగే ప్రేతాత్మ (దెయ్యం)గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపిస్తారు. విజయ్ దేవరకొండ తో ఖుషీ.. అలాగే యశోద సినిమాల్లోనూ సామ్ నటిస్తోంది.