వెబ్ సిరీస్ సంచలనం..మల్టీ ట్యాలెంటెడ్ మిథిలా పార్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వెబ్ మీడియాని బాగా పాలో అయ్యే వారికి అమ్మడు బాగా సుపరిచితురాలే. హీరోయిన్ కాకపోయినా వెబ్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లోనే పాపులైరంది ముంబై బ్యూటీ. ఓ కప్పును మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని మిథిల పాడిన ‘హై చాల్ తురు తురు’ అనే మరాఠీ సాంగ్ ఒక్క రోజులోనే ఆమెను యూట్యూబ్ స్టార్‌ను చేసేసింది. ఆమె జీవితాన్నే మార్చేసింది. సినిమా స్క్రీన్కు ఆమెను చూపించింది.
ఫిల్టర్ కాపీ… అనే యూట్యూబ్ చానెల్లో సెటైర్ షో ‘న్యూస్ దర్శన్’కు హోస్ట్‌గా.. ధ్రువ్ సెహగల్‌తో కలిసి ‘ఎన్నాయింగ్ థింగ్స్ బాయ్‌ఫ్రెండ్స్ డు’ అండ్ ‘కన్ఫ్యూజింగ్ థింగ్స్ గర్ల్‌ఫ్రెండ్స్ సే’ అనే షోనూ నిర్వహించింది. ఈ వీడియోలూ మిథిలాను వెబ్ మీడియాలో పెద్ద సెలెబ్రిటీని చేశాయి. అటుపై బాలీవుడ్ కిప్రమోట్ అయింది.
‘కట్టీ బట్టీ’ ఇమ్రాన్‌ఖాన్‌కు చెల్లెలుగా యాక్ట్ చేసింది. తర్వాత మరాఠీ సినిమా మురాంబాలోనూ హీరోయిన్ అయింది. అందులో ఓ పాట కూడా పాడింది. ‘గర్ల్ ఇన్ ద సిటీ’.. ‘లిటిల్ థింగ్స్’.. ‘చాప్ స్టిక్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో మిథిలను విపరీతంగా ఆదరించారు. న్యాటం.. సంగీతం పై మిథిలాకి మంచి గ్రిప్ ఉంది. ఇన్ని విషయాలున్నాయి కాబట్టే మెగా దంపతులు రామచ్ రణ్..ఉపాసనలు అభిమాన తారగా వాళ్ల మనసుల్లో స్థానం సంపాదించింది.
ఇప్పుడీ ఈ బ్యూటీ ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామ్ చరణ్ మిథిలా పాల్కర్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
‘మిథాలా పాల్కర్ ఓటీటీలో పెద్ద సూపర్ స్టార్. ఆమెకు నేను..నా భార్య ఉపాసన అభిమానులం. వెరీ ట్యాలెంటెడ్. తనకి చాలా విషయాలపై మంచి అవగాహన..పరిజ్ఞానం ఉన్నాయి’ అన్నారు. స్వయంగా రామ్ చరణ్ నే ఈ రేంజ్ లో పొగిడేసారంటే అమ్మడి ట్యాలెంట్ గురించి చెబితే తక్కువే అవుతుంది. ఎంతటి ప్రతిభావంతురాలు కాకపోతే చరణ్-ఉపాసన అభిమానిస్తారు. మొత్తానికి మిథిలా పాల్కర్ డెబ్యూ కి ముందే మెగా ఆశీస్సులు.. అభినందనలు అందేసుకుంది. వెబ్ సిరీస్ ల తరహాలో టాలీవుడ్ వెండి తెరపైనా మెరవాలని ఆశీద్దాం.