సాయిపల్లవి కథల ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆషామాషీ కథల్లో నటించదు. పాత్రలో అసభ్యత ఉండ కూడదు. గ్లామర్ సీన్లు..పెదవి మద్దులు ..రొమాంటిక్ సీన్లు అంటే గిట్టవు. అవి ఉంటే ఎన్ని కోట్లు పారితోషికం ఆఫర్ చేసినా నో చెప్పేస్తుంది. మనీ కాదు..సినిమాలో మ్యాటర్ ఉండాలి. అంతకు మంచి తన పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి అని కరాఖండీగా చేప్పేస్తుంది.
అవన్నీ పక్కాగా ఉంటేనే ప్రాజెక్ట్ కి సంతకం చేస్తుంది. రొమాంటిక్ సీన్సు గురించి సంతకం పెట్టే ముందు అడుగుతుంది. అన్ని తన కి అనుకూలంగా ఉంటనే కమిట్ అవుతుంది. లేదంటే నో చెప్పేస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో డాన్సుల్లో పోటీ పడాలి తప్ప! చెల్లెలు పాత్ర చేస్తే ఏం కిక్కేం వస్తుందని మెగా ఆఫర్ ని వదులకున్న ఘనాపాటి.
అలాంటి బ్యూటీని దర్శకుడు ఓ విషయంలో బాగానే ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవినే రివీల్ చేసింది. ఆ మధ్య ఓ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేవని ఒప్పుకుందట. అయితే సగం సినిమా షూటింగ్ పూర్తయ్యాక లిప్ లాక్ సీన్ చేయాలని ఆ మూవీ డైరెక్టర్ సాయి పల్లవిపై ఒత్తిడి తీసుకొచ్చాడట.
కమిట్ మెంట్ ఇచ్చావ్..తప్పక చేసి తీరాలని పట్టుబట్టాడుట. కానీ అందుకు సాయి పల్లవి ఏమాత్రం ఒప్పుకోలేదుట. సినిమా అయినా వదిలేస్తాను గానీ..అలాంటి సీన్లలో నటించనని కరాఖండీగా చేప్పేసిందిట. అయినా ఈ విషయాన్ని నాకు ముందు చెప్పలేదుగా..మధ్యలో ఈ తిక మకలేంటని బదాయించేసిందట. ఇలాంటి కిరికిరిలు పెట్టి ఇబ్బందలు పెట్టాలని చూస్తే తానేంట చూపిస్తానని హెచ్చరించింది.
దీంతో ఈ విషయం హీరోకి తెలియడంతోనే వెంటనే ఆయన రంగంలో ఇక దిగతి దర్శకుడిని ఒప్పించాడుట. తాను చేయను అని చెప్పినప్పుడు ఇబ్బంది పెట్టకూడదని సర్ది చెప్పి బ్యాలెన్స్ షూటింగ్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో సదరు హీరో డైరెక్టర్ కి జాగ్రత్తలు సూచించినట్లు తెలుస్తోంది.
ఆమె మళ్లీ మీటూ ఉద్యమం అంటూ మీడియా ముందుకెళ్లిందంటే? మొదటికే మోసం వస్తుందని కామ్ గా ఉండమని చెప్పారుట. అయితే ఆ సినిమా ఏంటి? ఆమెను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? అందులో హీరో ఎవరు? వంటి వివరాలు మాత్రం గొప్యంగా ఉన్నాయి. సాయి పల్లవి ఆ డిటైల్స్ రివీల్ చేయలేదు. మొత్తానికి పల్లవి లో ఈ రకమైన సెకెండ్ యాంగిల్ కూడా ఉందని తెలుస్తోంది.