అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సినిమాల విషయంలో లెక్క అటు ఇటు అవుతున్నా సరే.. అక్కడ తగ్గుతున్న గ్రాఫ్ ని తన హాట్ ఫోటో షూట్స్ తో బ్యాలెన్స్ చేస్తుంది. సినిమా హిట్టు పడినా పడకపోయినా జాన్వి కపూర్ ఫోటో షూట్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే.
ఏమాత్రం మొహమాటపడకుండా గ్లామర్ ఎటాక్ చేస్తున్న జాన్వి కపూర్ తన వలపుల వలలో ప్రేక్షకులను ఊగిసలాడేలా చేస్తుంది. పాలరాతి శిల్పం లాంటి సొగసులతో ప్రేక్షకులకు మత్తెక్కించేస్తుంది.
సినిమాల్లో అయితే ఆ పాత్ర లిమిటేషన్స్ లో గ్లామర్ డోస్ ఉంటుంది. కానీ ఫోటో షూట్స్ లో అలా కాదు. ఆమె ఎంత రెచ్చిపోవాలి అనుకుంటే అంత రెచ్చిపోవచ్చు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు స్కిన్ షో కోసం వెనకడుగు వేస్తే కష్టమే అందుకే.
అన్ లిమిటెడ్ గ్లామర్ ఎటాక్ తో అమ్మడు చేస్తున్న హాట్ షోకి అందుకు తగినట్టుగానే డబుల్ క్రేజ్ సంపాదిస్తుంది. చేసింది ఎనిమిది సినిమాలే అయినా బాలీవుడ్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా అవతరించింది జాన్వి కపూర్. కేవలం హిందీలోనే కాకుండా శ్రీదేవి లానే సౌత్ సినిమాలను చేయాలని చూస్తుంది జాన్వి కపూర్.
ముఖ్యంగా జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై పెద్ద చర్చే జరుగుతుంది. ఎన్.టి.ఆర్ మహేష్ లాంటి స్టార్ హీరోలతో ఆమె నటించడానికి సై అంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కూడా తాను రొమాన్స్ చేసేందుకు రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది జాన్వి.
అమ్మడు తెలుగు ఎంట్రీపై ఇక్కడ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందాల ప్రదర్శనలో ఏమాత్రం ఆలోచించని జాన్వి తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారి దారిలోనే జాన్వి కూడా త్వరలోనే ఇక్కడ సినిమా చేయాలని ఆశిద్దాం.