కత్రినా ఏం చేసినా ఫుల్ కిక్కే..!

బీ టౌన్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ బాలీవుడ్ లో హ్యూజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ అని తెలిసిందే. ఎంతోమంది హీరోలతో ఎఫైర్లను నడిపించి ఫైనల్ గా విక్కీ కౌశల్ ని పెళ్లాడింది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. సల్మాన్ తో టైగర్ 3 సినిమా చేస్తున్న కత్రినా కైఫ్ లేటెస్ట్ గా ఫోన్ భూత్ సినిమాలో నటించింది. ఇషాన్ ఖత్తర్ సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో కత్రినా ఫీమేల్ లీడ్ గా నటించింది. ఈ మూవీ యూనిట్ కత్రినా మీదే ఆశలన్ని పెట్టుకున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కత్రినా కైఫ్ ఓ రేంజ్ లో చేస్తుంది.

ఫోన్ భూత్ లో కత్రినా ఎంటర్టైన్ చేయడం పక్కా అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో కత్రినా అందాలకు కూడా పని చెప్పినట్టు ఉంది. పెళ్లి తర్వాత కూడా బెడ్ సీన్స్ లో ఎలాంటి మొహమాటం లేకుండా చేసింది కత్రినా.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హార్లీ క్విన్ అవతారం ఎత్తింది కత్రినా కైఫ్. ప్రస్తుతం హాలోవీన్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కత్రినా కైఫ్ ఇషాన్ ఖత్తర్ సిద్ధాంత్ చతుర్వేది కూడా హాలోవీన్ సెలబ్రేషన్స్ లో రకరాకల కాస్టూంతో కనిపించారు.

ముఖ్యంగా కత్రినా మాత్రం డిస్నీ కామిక్స్ హార్లీ క్వీన్ లా తయారైంది. తలకు రంగేసుకుని మరీ కత్రినా చేస్తున్న హంగామా చూసి ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈమధ్య సినిమాలు భారీగా ప్రమోషన్స్ చేస్తేనే తప్ప ఆడియన్స్ కి రీచ్ అవ్వట్లేదు. అందుకే త్వరలో రిలీజ్ అవబోతున్న ఫోన్ భూత్ టీం ఇలా ప్లాన్ చేశారు.

కత్రినా కైఫ్ కాస్టూం మాత్రం సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. వెరైటీగా ఏదైనా ట్రై చేయాలంటే అది క్యాట్ తర్వాతే అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కత్రినా ఈ సినిమాతో తిరిగి ఫాం లోకి వస్తుందని చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన కత్రినా తెలుగులో కూడా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ బాలకృష్ణలతో సినిమాలు చేసిన అమ్మడు మళ్లీ సౌత్ ఇండస్ట్రీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఆ మధ్య ప్రభాస్ తో కత్రినా జోడీ కడుతుందని ఒక న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. మళ్లీ తెలుగు తెర మీద కత్రినాని చూడాలని కోరుతున్నారు ఇక్కడ ఆడియన్స్.